spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Collections: ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ పడిపోతున్నాయా..? కారణమేంటంటే..?

Ustaad Bhagat Singh Collections: ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ పడిపోతున్నాయా..? కారణమేంటంటే..?

Ustaad Bhagat Singh Collections: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటిరోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే ఈ సినిమా మొదటిరోజు 40 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక రెండో రోజు ఈ సినిమా కలెక్షన్స్ భారీగా తగ్గాయి. ఇక మూడో రోజు మరింత తగ్గుముఖం పట్టాయి. నిజానికి ఇప్పటివరకు ఈ సినిమా 70 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న కూడా కలెక్షన్స్ పడిపోవడానికి గల కారణం ఏంటి అంటూ చాలామంది మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

నిజానికి ‘దురంధర్ 2’ సినిమాకి భారీ హైప్ రావడం సినిమా భారీ సక్సెస్ ని సాధించడం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద కొంతవరకు ఎఫెక్ట్ పడిందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. నిజానికి దురంధర్ 2 సినిమా రిలీజ్ కి ముందు అంత పెద్ద హైప్ క్రియేట్ చేయలేదు. కానీ రిలీజ్ అయిన తర్వాత మన హీరోలు, దర్శకులు ఆ సినిమా చూసి ట్వీట్లు చేయడంతో తెలుగులో కూడా సినిమాకి భారీ క్రేజ్ పెరిగింది.

ప్రస్తుతం ఇప్పుడు ఆ సినిమా భారీ రికార్డులను కొల్లగొట్టే దిశగా ముందుకు దూసుకెళ్తుంది. దానివల్ల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి చాలా వరకు మైనస్ అయిందనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్టామినా ను చూపిస్తూ హరీష్ శంకర్ చేసిన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులకు బాగా నచ్చింది. వాళ్ళే రిపీటెడ్ గా ఈ సినిమాని చూస్తున్నారు.

సగటు ప్రేక్షకులు సైతం ఈ సినిమాని చూడడానికి ఇష్టపడుతున్నారు కానీ కలెక్షన్స్ మాత్రం భారీగా రాకపోవడానికి కారణం దురంధర్ 2 సినిమానే అని చెబుతున్నారు…ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా చాటడనే చెప్పాలి. గత సంవత్సరం ఓజీ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం విశేషం…

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version