టాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్ రాజమౌళి ఉన్న క్రేజ్ మాములుది కాదు. ఆయన సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ హీరోలు కూడా వెనుకాడరు. అందుకే ఆయన అడగగానే వద్దనే హీరో గానీ.. హీరోయిన్ గానీ లేరు. ఒక వేళ్ వద్దంటే వారి పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి సినిమాలో ఎక్కువగా గ్రాఫిక్స్ అని చెప్పుకోవచ్చు. సినిమా కథలో ఏమున్నా లేకపోయినా విజువల్స్ కు మాత్రం ఫుల్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. సినిమా షూటింగ్ తీసే రోజులు తక్కువే అయినా దానిని తీర్చి దిద్దడానికే ఎక్కువ సమయం తీసుకుంటాడు.
తాజాగా జక్కన్నపై ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆయన మొదటిసారిగా మల్టీస్టారర్ సినిమా తీస్తున్న విషయం తెలిసింది. ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ను కొనసాగిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇప్పటి వరకు విడుదల చేసిన.. తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోపై రకరకాలుగా చర్చ సాగుతోంది. ఓవరాల్ గా అంతకుముందు తీసిన బాహుబలి రేంజ్ ను అందుకుంటుందా..? అనే అనుమానాలను కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని చెబుతున్నారు.
ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఎక్కువగా విజువల్స్ వాడదలుచుకోలేదు. ఇందులో ఎక్కువగా సోషల్ కథాంశమే ఎక్కువగా ఉంటుందని స్వయంగా రాజమౌళే చెప్పాడు. గ్రాఫిక్స్ ఏ కొంచెం లేనిది జక్కన్న సినిమా మొదలు పెట్టడు. ‘బాహుబలి’ రెండు సినిమాల్లో ఆయన చేసిన మాయ గురించి ఇప్పటికీ ఎవరూ మరిచిపోరు. అలాంటిది ఈ సినిమాలో ఎక్కువగా వాడదలుచుకోలేదని చెప్పడంతో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.
అయితే అంతకుముందు జక్కన్న ఫుల్ ఎగ్జైట్మెంట్ తో సినిమా గురించి చెప్పేవాడు. కానీ ఇప్పుడు సినిమా గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. దీంతో ఈ మూవీ అనుకున్న స్థాయిలో రాబోతుందా..? లేదా తేడా కొడుతుందా..? అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే మర్యాద రామన్న లాంటి సినిమాల్లో కూడా రాజమౌళి విజువల్స్ వాడలేదు. అయినా ఆ సినిమా హిట్టయింది. అయితే విజువల్స్ వాడకున్న సినిమా స్టోరీ హైలెట్ అయినప్పుడు బంపర్ హిట్టవుతుందని రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి రాజమౌళీ ఈ సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.