Ata Dance Show Vamsi Walkout Reason: జీ తెలుగు లో ప్రతీ శని , ఆదివారాల్లో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఆట’ ప్రస్తుతం మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ డ్యాన్స్ రియాలిటీ షో లోని కంటెస్టెంట్స్ ని చూస్తే ఎవరికైనా పైకి లేచి చప్పట్లు కొట్టాలని అనిపిస్తుంది. ఆ రేంజ్ లో డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్లంతా జానీ మాస్టర్ సెలక్షన్ నుండి వచ్చినవాళ్లే. మొదటి నాలుగు ఎపిసోడ్స్ లో జానీ మాస్టర్ జడ్జీగా కనిపించాడు, కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ , ఆయన ఈ షో నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన స్థానం లోకి రఘు మాస్టర్ కొనసాగుతున్నాడు. అయితే ప్లేయర్స్ లో కూడా ఎవరో ఒకరు ఈ షో ని మధ్యలోనే వదిలి వెళ్ళిపోతారేమో అనే అనుమానం మొదటి నుండి ఉండేది.
Also Read: 27 కోట్లు పెట్టి కొంటే.. నిండా ముంచాడు.. పాపం ఆయన కష్టం పగవాడికి కూడా రావద్దు
ఆ అనుమానం నుండి కూడా నిజమైంది. ఈ షో లో ఒక ప్లేయర్ గా వ్యవహరిస్తున్న వంశీ ధర్ ఇప్పుడు తప్పుకున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమో లో వంశీ కనిపించలేదు. ఆయన స్థానం లోకి చలాకీ చంటి వచ్చాడు. అయితే ఇది కేవలం కొన్ని ఎపిసోడ్స్ వరకు మాత్రమేనా?, లేదా ఈ సీజన్ మొత్తం వంశీ కి బదులు చలాకీ చంటి నే కొనసాగుతాడా అనేది తెలియాల్సి ఉంది. జానీ మాస్టర్ మొదట్లో మిస్ అయ్యినప్పుడు కూడా అంతా ఇలాగే అనుకున్నారు. కచ్చితంగా రాబోయే ఎపిసోడ్స్ కి ఆయన వస్తాడని అనుకున్నారు , కానీ అది జరగలేదు. ఇది కూడా అలాగే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ షో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో వంశీ కూడా ఒకడు. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్ లో క్లిక్ అయ్యింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో కలిసి ఆయన వేసే పంచులు మామూలు క్రేజ్ ఉండేది కాదు.
కేవలం వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాల కోసమే ఈ షో ని చూసే వాళ్ళు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి వంశీ ఇప్పుడు అకస్మాత్తుగా ఈ షో నుండి వెళ్లిపోవడం నిజంగా అభిమానులకు పెద్ద నిరాశే. అయితే ఎందుకు ఆయన ఈ షో నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది?, రెమ్యూనరేషన్ విషయం లో నిహారిక తో టర్మ్స్ కుదర్లేదా?, లేకపోతే సినిమా అవకాశాలు రావడం వల్ల , డేట్స్ ని సర్దుబాటు చెయ్యలేక ఈ షో మానేయాల్సి వచ్చిందా అనేది తెలియాలి. ఈ వారం జరగబోయే ఎపిసోడ్స్ లో వంశీ ఎందుకు రాలేదో కారణం చెప్తారో లేదో చూడాలి.
