spot_img
Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీGoogle AI Pro Plan Update 2026: Google ఏఐ ప్రో ప్లాన్ అప్డేట్.. స్టూడెంట్స్...

Google AI Pro Plan Update 2026: Google ఏఐ ప్రో ప్లాన్ అప్డేట్.. స్టూడెంట్స్ కు బెనిఫిట్స్..

Google AI Pro Plan Update 2026: ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఫోన్స్ కు అత్యధిక ఆదరణ ఉంటుంది. అయితే ఈ మొబైల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇందులో భాగంగా గూగుల్ తన గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ ప్లాన్ అప్డేట్ చేస్తున్నట్లు గురువారం తెలిపింది. ఈ ప్లాన్ లో భాగంగా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అత్యధిక బాండిల్డ్ క్లౌడ్ స్టోరేజ్ ని పొందుతారని కంపెనీ తెలిపింది. ఇందులో AI ఫీచర్స్ కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. పర్యావరణ వ్యవస్థ లో భాగంగా క్లౌడ్ స్టోరేజ్ అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఇది ఇచ్చే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Also Read: 27 కోట్లు పెట్టి కొంటే.. నిండా ముంచాడు.. పాపం ఆయన కష్టం పగవాడికి కూడా రావద్దు

కొత్త అప్డేట్ ప్రకారం.. గూగుల్ AI ప్రో ప్లాన్ కు చందాదారులు గతంలో ఉన్న 2 TB కంటే ఇప్పుడు అదనంగా 5 TB స్టోరేజ్ పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని గూగుల్ వన్ అధిపతి అయిన సిమ్రిట్ బెన్ యేర్ తన ఎక్స్ పోస్టులో ఉంచారు. ఇందులో భాగంగా గూగుల్ డ్రైవ్, జిమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి సేవలు అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. క్లౌడ్ స్పేస్ పెరగడంతో వినియోగదారులు తమ వీడియోలను, ఫోటోలను ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది.

అయితే ఈ స్టోరేజ్ పెరగడానికి ఎలాంటి అధనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని గూగుల్ తెలుపుతుంది. ఇప్పటివరకు ఈ ప్లాన్ ద్వారా నెలకు రూ.1950 ఉండగా.. ఏడాదికి రూ.19,500 తో కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువగా AI కంటెంట్లు సృష్టించేవారు ఉండడంతో స్టోరేజ్ ఎక్కువగా అవసరం ఉంటుంది. దీంతో ఈ కొత్త అప్డేట్ చాలామందికి ఉపయోగపడనుంది. కొత్త క్లౌడ్ స్టోరేజ్ తో గూగుల్ ఫోటోలు, సేవలో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాకుండా స్టూడెంట్స్ తో పాటు రోజువారి వినియోగదారులు తమ కార్యకలాపాలను విస్తరించుకోవచ్చు.

గూగుల్ కు చెందిన AI ప్రో ప్లాన్ జెమిని AI మోడల్స్ అయినా డీప్ రిసర్చ్ కు ఇది సహకరిస్తుంది. అలాగే టెక్ దిగ్గజం అయిన గూగుల్ ఏఐలో వీడియోలు సృష్టించడానికి ఈ స్టోరేజ్ ఉపయోగపడనుంది విస్క్ లో వియో 2 వీడియోలు సృష్టించడానికి ఈ పరిమితి సరిపోతుంది. అంతేకాకుండా స్టూడెంట్స్ నెలవారి AI క్రెడిట్ లను కూడా పొందుతారు. ఇవి స్లో, విస్క్ ప్లాట్ ఫామ్ లో టెక్స్ట్ ఇమేజ్ తో పాటు వీడియో జనరేషన్ ప్రశ్నలకు జవాబులు అందించడానికి సపోర్ట్ గా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version