Pawan – Mahesh : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు స్టార్ హీరోలు అవ్వడానికి కొన్ని ప్రత్యేకమైన కథలను ఎంచుకొని వాటిని సినిమాలు గా మార్చి మంచి సక్సెలను కొట్టి స్టార్ హీరోలుగా ఎదగాలనే ఒకే ఒక కోరిక తో ఉంటారు.కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్టార్ హీరో హోదా ని అనుభవిస్తున్న కూడా దాన్ని వదిలేసి పొలిటిక్స్ వైపు వెళ్లాడు సినిమాల్లో చాలా రాయల్ లైఫ్ ని అనుభవిస్తున్నప్పటికీ మంచి లైఫ్ ని వదిలేసి పాలిటిక్స్ వైపు వెళ్లడం పట్ల చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. అయినప్పటికీ తను పాలిటిక్స్ అంటే ఇష్టం ఉంది జనానికి సేవ చేయాలనే ఉద్దేశ్యం తోనే ఆయన అలా పాలిటిక్స్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక తను సర్వైవల్ అవ్వడానికి చాలా సినిమాలు చేస్తూ వచ్చిన డబ్బుతో పార్టీని నడిపిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ రెండు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…
ఇక ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు సరి కొత్త రీతిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగాడు… ఇక అదే క్రమంలో మహేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ కి మధ్య కొన్ని కామన్ పాయింట్స్ అనేవి కలిసాయి… అవి ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…
పవన్ కళ్యాణ్ కి మహేష్ బాబు కి ఇద్దరికీ ఎక్కువగా సిగ్గు అనేది ఉంటుంది అందువల్లే వాళ్ళు బయట ఫంక్షన్ కి దేనికి ఎక్కువగా రారు వచ్చిన పెద్దగా మాట్లాడరు…
ఇక వీళ్ళిద్దరి ఏడవ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏడో సినిమా అయిన ఖుషితో సూపర్ హిట్ అందుకుంటే, మహేష్ బాబు తన ఏడో సినిమా అయిన ఒక్కడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు…
ఇక ఇద్దరూ వైజాగ్ సత్యానంద్ గారి దగ్గరే యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు…
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరికీ మంచి క్లోజ్ ఫ్రెండ్ గా ఉండటం మరో విశేషం…
అలాగే ఇద్దరు తమవంతు సేవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు…
ఇలా వీళ్లిద్దరూ మొదటి నుంచి కూడా మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ బాగుండటం కోసం తమ వంతు కృషి చేస్తూనే వస్తున్నారు…