https://oktelugu.com/

Star Heroine : సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ ని చూసి ఆత్మహత్యయత్నం చేసిన స్టార్ హీరోయిన్

Star Heroine : సినీ నటులకు సోషల్ మీడియా లో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో, అంటే నెగెటివిటీ కూడా ఉంటుంది. కొంతమంది ప్రేమని ద్వేషాన్ని సమానంగా తీసుకుంటారు, మరికొంత మంది ద్వేషాన్ని అసలు తీసుకోలేకపోయారు. వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కొంతమంది సెలెబ్రిటీలు సోషల్ మీడియా లో నెటిజెన్స్ చేసే నెగటివ్ కామెంట్స్ గురించి పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటూ ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.అలాంటి వాళ్ళని చూస్తే అయ్యో పాపం అనిపిస్తాది. పైగా ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 5, 2023 / 07:19 PM IST
    Follow us on

    Star Heroine : సినీ నటులకు సోషల్ మీడియా లో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో, అంటే నెగెటివిటీ కూడా ఉంటుంది. కొంతమంది ప్రేమని ద్వేషాన్ని సమానంగా తీసుకుంటారు, మరికొంత మంది ద్వేషాన్ని అసలు తీసుకోలేకపోయారు. వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కొంతమంది సెలెబ్రిటీలు సోషల్ మీడియా లో నెటిజెన్స్ చేసే నెగటివ్ కామెంట్స్ గురించి పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటూ ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.అలాంటి వాళ్ళని చూస్తే అయ్యో పాపం అనిపిస్తాది.

    పైగా ఈ మధ్య సోషల్ మీడియాలో నెపోటిజం పేరుతో ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి, వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతమంది హీరోలను, హీరోయిన్స్ ని చాలా నీచంగా తిడుతూ, వెక్కిరిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ వల్ల తాను ఎంత మానసిక వేదనకు గురి అయ్యాను అంటూ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పుకొచ్చింది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తనకి సోషల్ మీడియా ద్వారా ఎదురైనా చేదు విషయాలను చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యింది.

    ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో నేను చాలా లావుగా ఉండేదానిని, నా నటన కూడా అంత గొప్పగా ఉండేది కాదు, సోషల్ మీడియాలో నాపై నెటిజెన్స్ బాడీ షేమింగ్ చేస్తూ చాలా ఘోరమైన కామెంట్స్ చేసేవారు. నాకు నటనే రాదనీ, శరత్ కుమార్ కుమార్తె కాకపోతే కనీసం సైడ్ క్యారెక్టర్స్ కి కూడా పనికిరానని, ఇలా ఎన్నో నీచమైన కామెంట్స్ చేసేవారు. ఒక్కోసారి వాళ్ళ నెగటివ్ కామెంట్స్ భరించలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఇలాంటి వాళ్లకి సరైన సమాధానం నా సక్సెస్ తోనే చెప్పాలి, నేను బ్రతికి చూపించి, నటిగా నాలో ఎలాంటి టాలెంట్ ఉందో అందరికీ అర్థం అయ్యేలా చేస్తాను అనుకోని ఎంతో కసిగా నన్ను నేను మార్చుకున్నాను..ఈరోజు నేను నటిగా ఎలాంటి సక్సెస్ లు చూస్తున్నానో మీ అందరికీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు’ అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.