https://oktelugu.com/

Atharintiki Daaredi : ‘అత్తారింటికి దారేది’ సినిమాని వదులుకున్న స్టార్ హీరో అతనేనా..!

ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని త్రివిక్రమ్ ముందు గా పవన్ కళ్యాణ్ కోసం రాసుకోలేదట, ఇలాంటి సాఫ్ట్ సినిమాలకు మహేష్ బాబు అయితేనే సరిగ్గా సూట్ అవుతాడని, ఆయన కోసమే ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట.

Written By: , Updated On : May 26, 2023 / 09:53 PM IST
Follow us on

Atharintiki Daaredi : పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘అత్తారింటికి దారేది’. జల్సా లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇది. విడుదలకు ముందే HD క్వాలిటీ ప్రింట్ తో సినిమా లీక్ అయ్యినప్పటికీ ఈ చిత్రం ఆరోజుల్లోనే 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది.

అప్పట్లో రాజమౌళి ‘మగధీర’ చిత్రం వసూళ్లను అందుకోవడం పెద్ద కష్టం అయ్యేది. ఇప్పుడు బాహుబలి వసూళ్లు ఎలాగో, అప్పట్లో మగధీర వసూళ్లు అలా అన్నమాట. అలాంటి మగధీర కలెక్షన్స్ కి పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం తో దగ్గరకి రాగా, ఆ తర్వాత వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం తో ఏకంగా మగధీర వసూళ్లనే దాటేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసాడు.ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ ని అందుకోని స్టార్ హీరోలు ఎంతో మంది ఉన్నారు.

అయితే ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని త్రివిక్రమ్ ముందు గా పవన్ కళ్యాణ్ కోసం రాసుకోలేదట, ఇలాంటి సాఫ్ట్ సినిమాలకు మహేష్ బాబు అయితేనే సరిగ్గా సూట్ అవుతాడని, ఆయన కోసమే ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట.కానీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన డేట్స్ మొత్తాన్ని త్రివిక్రమ్ సినిమా కోసం ఇచ్చేసాడు. ఆ సమయం లో త్రివిక్రమ్ దగ్గర ‘అత్తారింటికి దారేది’ స్క్రిప్ట్ మినహా, మరొకటి లేదు.

దీనితో ఆ స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ తోనే చేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఫలితం ఎలాంటిది వచ్చిందో అందరూ చూసారు.మరో విశేషం ఏమిటంటే, ‘అత్తారింటికి దారేది’ చిత్రం రికార్డ్స్ ‘బాహుబలి’ వచ్చే వరకు ఏ స్టార్ హీరో బ్రేక్ చెయ్యలేకపోయాడు. పైగా అప్పటి హీరోలందరికీ హిట్స్ వచ్చాయి, అయిన కూడా బ్రేక్ చెయ్యలేకపోయారంటే, ఈ చిత్రం రికార్డ్స్ ఎంత స్ట్రాంగ్ అనేది అర్థం చేసుకోవచ్చు.