OG movie : మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. ఎక్కడ ఒక చిన్న రిమార్క్ కూడా రాకూడదు.ఎలాగైనా మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వస్తున్నాం . అన్నయ్య పేరుకి ఏ మాత్రం బ్యాడ్ నేమ్ రాకూడదంటే మనం ఇక్కడ ఎలాగైనా హీరోగా రాణించాలి అనే ఒకే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో వచ్చాడు కష్టపడ్డాడు టాప్ రేంజ్ కి వెళ్ళాడు.ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్ లో ఓ జి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయింది. అది ఎలా ఉంది అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలాగైతే ఆయన్ని చూడాలనుకుంటున్నారో దానికి ఏ మాత్రం తగ్గకుండా టీజర్ ఉంది. ఇక సుజిత్ ఈ సినిమాని చాలా కొత్తగా డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఒక్క టీజర్ ని చూసిన అభిమానులు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించబోతున్నాడనే నమ్మకంతో ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆ సినిమా నుంచి ఒక డైలాగ్ అయితే లీక్ అయింది అంటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది.
అది ఏంటి అంటే ఒక రౌడీ పవన్ కళ్యాణ్ తో వేటగాడు వేటకి వచ్చాడు భయపడవే అని అంటడట దాంతో పవన్ కళ్యాణ్ నవ్వి “నువ్వు వేటగాడు అయితే జింకను వేటాడు కానీ చిరుతను ఎలా వేటాడుతావ్ రా” అంటూ సాగే ఒక డైలాగు లీక్ అయినట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా ఇప్పటికిప్పుడు రిలీజ్ అయిన భారీ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకుంటుంది అనడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…