https://oktelugu.com/

YCP Leaders romance : వైసీపీ నేతల వికృత శృంగార చేష్టలు తప్పు కాదు.. సర్టిఫికెట్ ఇచ్చిన ఒక ప్రముఖ వెబ్ సైట్ అధినేత

YCP Leaders romance : మనోళ్లు చేస్తే శృంగారం.. పక్కోడు చేస్తేనే వ్యభిచారం.. రాజకీయాల్లో ఫేమస్ సామెత ఇదీ.. ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ లో దొరికిన ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కక్కలేక మింగలేక వైసీపీ సతమతమవుతుంటే.. దాని అనుకూల మీడియా మాత్రం తాజాగా ‘వైసీపీ నేతల వికృత శృంగార చేష్టలను’ సమర్థించేలా కథనాలు రాయడం అందరినీ ముక్కునవేలేసుకునేలా చేసింది. తెలుగులో ప్రముఖ వెబ్ సైట్ గా పేరుగాంచిన ‘గ్రేట్ ఆంధ్రా’ ఆది నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 16, 2022 / 02:40 PM IST
    Follow us on

    YCP Leaders romance : మనోళ్లు చేస్తే శృంగారం.. పక్కోడు చేస్తేనే వ్యభిచారం.. రాజకీయాల్లో ఫేమస్ సామెత ఇదీ.. ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ లో దొరికిన ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కక్కలేక మింగలేక వైసీపీ సతమతమవుతుంటే.. దాని అనుకూల మీడియా మాత్రం తాజాగా ‘వైసీపీ నేతల వికృత శృంగార చేష్టలను’ సమర్థించేలా కథనాలు రాయడం అందరినీ ముక్కునవేలేసుకునేలా చేసింది. తెలుగులో ప్రముఖ వెబ్ సైట్ గా పేరుగాంచిన ‘గ్రేట్ ఆంధ్రా’ ఆది నుంచి వైసీపీపై ఈగ వాలనీయకుండా కాపు కాస్తుంటుంది. సినీ రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేసి బట్టలిప్పి బరివాత నిలబెడుతుంది. సరే తప్పులుంటే అలా నిలబెట్టవచ్చు. కానీ ఇప్పుడు వైసీపీ నేతల బూతు బాగోతాన్ని సైతం ఆ వెబ్ సైట్ ఓనర్ ‘వెంకట్’ సమర్థిస్తూ తన వెబ్ సైట్ లో సంపాదకీయం రాయడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

    ‘వైసీపీ నేతలు చేసే వికృత శృంగార చేష్టలు ఆ భాగస్వామ్య మహిళలకు ఇష్టమేనట.. అందుకే అలా వైసీపీ నేతలు బట్టలిప్పి బరివాత తిరిగారట.. ఆ మహిళలతో వారికి సెక్స్ జరిగిందని.. ఈ కాలంలో ఇష్టంతో సెక్స్ చేస్తే తప్పు కాదని సుప్రీంకోర్టునే చెప్పిందంటూ.. ’ ఏకంగా వైసీపీ నేతల చిలక్కొట్టుడు వ్యవహారాలన్నీ కూడా ఆ వెబ్ సైట్ ఒప్పేనని సమర్థించింది. ఇంతటి నిర్లజ్జ రాతలు చూసిన జర్నలిస్టు మిత్రులందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

    సినీ, రాజకీయ, ప్రముఖులందరూ.. ముఖ్యంగా ప్రజాజీవితంలో ఉన్న వారు ఆదర్శంగా ఉండాలి. వారి ఏ వ్యవహారం అయినా సరే బయటపడకూడదు. బయటపడితే వారు ఆ రంగంలో ఉండడానికి వీల్లేదు. పరువు పోతుంది. ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. కానీ ఇష్టంతో శృంగారం చేసే మహిళలతో వైసీపీ నేతలు చేసిన వ్యవహారాలు ఒప్పేనని.. సుప్రీంకోర్టు ఇష్టంతో సెక్స్ నేరం కాదంటూ ‘గ్రేట్ ఆంధ్రా’ ఓనర్ కొత్త భాష్యం చెప్పారు. దీన్ని బట్టి భార్యపిల్లలు ఉన్నా సరే వేరే మహిళ సై అంటే ప్రజాజీవితంలో ఉన్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ప్రొసీడ్ కావచ్చని.. అందులో తప్పులేదని ఆయన ప్రొజెక్ట్ చేశారు.

    సమాజంలో బతికేవారు నీతి నిజాయితీలతో ఉండాలి. సరే ఉండకున్నా కూడా వాటిని బయటకు పొక్కనివ్వదు. పొక్కితే దాన్ని తప్పు అని అందరూ అంగీకరించాలి. కానీ ఘనత వహించిన ఆ వెబ్ సైట్ ఓనర్ మాత్రం ‘వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్లంటే ఇష్టమైన మహిళలతో సెక్స్ చేస్తే మీకేంటి నొప్పి?’ అని ప్రశ్నిస్తున్నాడు. సరే మనకేం నొప్పి లేదు. కానీ ఆ మంత్రులు, ఎమ్మెల్యేల ఇంట్లోని భార్య, పిల్లలకు నొప్పి కాదా? ఎంత పరువు తక్కువ. వైసీపీ పార్టీకి నొప్పి కాదా? ఆ పార్టీలో ఉంటూ ఇలా శృంగార లీలలు చేయడం కరెక్టా? అని అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.

    అందరికీ శ్రీరంగనీతులు చెప్పే ఆ స్వామి చివరకు ‘ఆ గుడిసెల్లో సొచ్చినట్టు’గా.. అన్ని విషయాలపై విశ్లేషణలు చేసే గ్రేట్ ఆంధ్రా పెద్ద మనిషి ఇప్పుడు వైసీపీ నేతల సెక్స్ కోరికలను సమర్థించడం అందరినీ విస్మయపరుస్తోంది. అసలు జర్నలిస్టు విలువలు, రాతలకు కనీసం విలువ లేకుండా ఇంత దిగజారుడు రాతలు రాసిన ఆ పెద్దమనిషిది ఏం బుర్ర కూడా అర్థం కావడం లేదని జర్నలిస్టు సర్కిల్స్ లో ఆడిపోసుకుంటున్నారు.

    వైసీపీ నేతలు చేసే సెక్స్ తప్పులను కూడా ఒప్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసిన ఆ వెబ్ సైట్ తీరును ఇప్పుడు అందరూ కడిగేస్తున్నారు. వ్యక్తిగత జీవితం వారిష్టం.. ఇష్టపడి చేసే సెక్స్ తప్పు కాదంటూ సమర్థించుకోవడం ఏంటో అర్థం కానీ పరిస్థితి. రాజకీయాల్లో నీతిమాలిన వారుంటే వారిని వెనకేసుకొచ్చిన ఇలాంటి జర్నలిస్టులను ఏమనాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలా రాత రోతలకు ఇప్పటికైనా స్వస్తి పలికి.. నిజాలను నిర్భయంగా కడిగేస్తే ఆ దమ్మున్న వెబ్ సైట్ నిలబడుతుంది. లేదంటే జనాలే దుమ్ము రేగ్గొడుతారు జాగ్రత్త..