Drushyam movie : మలయాళం లో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. దాదాపుగా అన్ని భాషల్లో ఈ సినిమా రీమేక్ అయింది. రీమేక్ అయిన ప్రతి భాషలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా ఆయా భాషల్లో చేసిన హీరోలకి మంచి గుర్తింపును కూడా తీసుకువచ్చింది. ఇక తమిళంలో కమలహాసన్ హీరోగా ఈ సినిమా చేయడం జరిగింది.అక్కడ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా రీమేక్ చేద్దాం అని అనుకున్నప్పుడు డైరెక్టర్ మొదట రజినీకాంత్ తో చేద్దాం అనుకొని ఆయన్ని కలిసి ఈ కథ చెబితే ఒరిజినల్ సినిమా చూసిన రజిని కాంత్ అందులో హీరోని చివర్లో జైల్లో వేసి కానిస్టేబుల్ కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. దాన్ని మార్చితే నేను చేస్తాను అని రజనీకాంత్ డైరెక్టర్ తో చెప్పాడంట కానీ ఆ సినిమాకి ఇంపార్టెంట్ సీన్ అదే అవడంతో దాన్ని మార్చడం కుదరకపోవడం వల్ల రజనీకాంత్ ఆ సినిమాని వదిలేసుకోవడం జరిగింది.
ఎందుకంటే స్టార్ హీరో అయిన రజనీకాంత్ ని అలా జైల్లో వేసి ఒక కానిస్టేబుల్ కొడుతూ ఉండడం అతని ఫాన్స్ చూసి జీర్ణించుకోలేరు. కాబట్టి ఆ సినిమాని రజినీకాంత్ వదిలేయడం జరిగింది. కానీ ఆ సినిమా రజినీకాంత్ చేస్తే ఇంకో లెవెల్ లో ఉండేదని ట్రేడ్ పండితులు సైతం అప్పట్లో వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా లో గౌతమి, కమలహాసన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఒక మంచి హిట్ సినిమాగా గుర్తింపు పొందింది. కమలహాసన్ ఈ సినిమా తర్వాత మళ్లీ విక్రమ్ సినిమాతోనే హిట్టు అందుకోవడం జరిగింది. అయితే రజనీకాంత్ ఒప్పుకొనుంటే ఈ సినిమా ఇంకా ప్రతి ప్రేక్షకుడికి చాలా బాగా రీచ్ అయ్యేది అని ఇప్పటికి చాలామంది చెప్తూ ఉంటారు. కమలహాసన్ అనేసరికి ఒక సాప్ట్ ఆడియన్స్ మాత్రమే చూస్తారు అదే రజనీకాంత్ అయితే ఆల్ కేటగిరీ లో ఉన్న అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని చూసే అవకాశం ఉండేది అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా రజనీకాంత్ ఒక సినిమా చేసేటప్పుడు వాళ్ళ అభిమానులను దృష్టిలో ఉంచుకొని సినిమా చేస్తాడు అని అనడానికి ఈ సినిమాని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. జస్ట్ ఒక్క సీన్ వల్ల తను సినిమా చేయకుండా ఆగిపోయాడు అంటే అర్థం చేసుకోవచ్చు రజినీకాంత్ కి అభిమానుల్లో ఉన్న అభిమానం ఏంటి అనేది…ఇక రీసెంట్ గా రజినీకాంత్ చేసిన జైలర్ సినిమా సూపర్ హిట్ ని అందుకుంది. ఇటు తెలుగు,అటు తమిళ్ రెండు భాషల్లో రిలీజ్ అయి తనదైన మార్క్ నటనని చూపిస్తూ రజనీకాంత్ చేసిన జైలర్ ఆయన కెరియర్ లో బెస్ట్ సినిమాలో ఒకటిగా నిలిచిపోయింది అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అందుకే రజినీకాంత్ తన నెక్స్ట్ సినిమాని మరింత ఉత్సాహం తో చేస్తున్నట్టుగా తెలుస్తుంది…