Sharwanand
Sharwanand : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో శర్వానంద్ కూడా ఒకడిగా ఉంటాడు.సోలో లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసిన ఈ హీరో ఈ ఏడాది జనవరి 26 వ తేదీన తెలంగాణ హై కోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డి తో నిశ్చితార్థం అయ్యింది.రక్షిత రెడ్డి చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి లో నాలుగు సార్లు MLA గా గెలుపొందిన దివంగత నేత బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి కి స్వయానా మనవరాలు అవుతుంది.
అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతుండడం తో శర్వానంద్ పెళ్లి టాపిక్ కొన్ని రోజులు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిల్చింది. చాలా సింపుల్ గా బంధు మిత్రులు మరియు కొంతమంది సినీ ప్రముఖుల మధ్య శర్వానంద్ ఈ నిశ్చితార్థం జరుపుకొని నాలుగు నెలలు అవుతుంది,కానీ ఇప్పటి వరకు పెళ్లి ప్రస్తావనే రాలేదు.
దీంతో శర్వానంద్ పెళ్లి రద్దు అయ్యినట్టు సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది.అయితే ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చెయ్యగా , శర్వానంద్ గత కొంతకాలం నుండి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని, దానికి తోడు వీళ్లిద్దరికీ పెళ్ళికి ప్రస్తుతం ఉన్న ముహుర్తాలు ఏవీ కూడా అనుకూలంగా లేదని, అందుకే కొంతకాలం వరకు పెళ్లిని వాయిదా వేసాడని తెలిసింది.
ఈ ఏడాది లోనే వీళ్ళ పెళ్లి జరగబోతుందని సమాచారం. ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న శర్వానంద్ రీసెంట్ గానే ‘ఒకేఒక జీవితం’ అనే సినిమాతో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన శ్రీరామ్ ఆదిత్య తో తన 35 వ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.