spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay NDA Alliance: NDA కూటమి లో చేరడానికి తమిళ హీరో విజయ్ సై ..కానీ...

Vijay NDA Alliance: NDA కూటమి లో చేరడానికి తమిళ హీరో విజయ్ సై ..కానీ షరతులు ఇవే!

Vijay NDA Alliance: మరో రెండు నెలల్లో తమిళనాడు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా DMK పార్టీ ఘనవిజయం సాధించి మరోసారి అధికారం చేపట్టబోతుందని సర్వేలు చెప్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) స్థాపించిన TVK పార్టీ కూడా పోటీ చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అందుకే ఈ ఎన్నికలపై ఎప్పుడూ లేనంతగా యువత ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుత సర్వేల లెక్కల ప్రకారం TVK పార్టీ కి సొంతంగా పోటీ చేసి అధికారాన్ని చేపట్టేంత బలమైతే లేదు కానీ, కచ్చితంగా డబుల్ డిజిట్ ఓట్ షేర్ ని మాత్రం సొంతం చేసుకుంటుందని అంటున్నారు. మరి అది జరుగుతుందో లేదో తెలియదు కానీ, జరిగితే మాత్రం హిస్టరీ నే. అయితే ఇలా పోటీ చేయడం వల్ల, వ్యతిరేక ఓట్లు చీలి మరోసారి DMK అవలీలగా అధికారాన్ని చేప్పట్టడమే తప్ప, ఎలాంటి ఉపయోగం ఉండదని రాజకీయ విశ్లేషకుల వాదన.

Also Read: ‘ధురంధర్ 2’ తో పోటీ పడడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసిన పెద్ద మిస్టేక్.. ఓవర్సీస్ లో చావు దెబ్బ!

ఇదంతా పక్కన పెడితే తమిళనాడు ఎన్నికలకు అన్నా DMK , బీజేపీ పార్టీలు కలిసి NDA కూటమిగా ఏర్పడి పోటీ చేయబోతున్నాయి. బీజేపీ పార్టీ విజయ్ ని NDA లోకి లాగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేత మధ్యవర్తిత్వం కూడా చేయించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సూపర్ స్టార్స్ తో కూడా బీజేపీ మధ్యవర్తిత్వం చేయించింది. కానీ విజయ్ మాత్రం బీజేపీ లోకి వచ్చేందుకు మొగ్గు చూపించడం లేదు. బీజేపీ పార్టీ NDA తరుపున ఉప ముఖ్యమంత్రి పదవి తో పాటు TVK పార్టీ కి 80 సీట్లను కేటాయించేందుకు అంగీకరించింది. కానీ విజయ్ ఒప్పుకోవడం లేదు. రెండున్నర సంవత్సరం పాటు సీఎం పదవి ఇస్తేనే NDA లోకి వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉంది NDA కూటమి.

2029 ఎన్నికల్లో మళ్లీ బీజేపీ కేంద్రం లో అధికారం లోకి రావాలంటే, సౌత్ స్టేట్స్ పై పట్టు సాధించాల్సిందే. తెలంగాణ లో ఆ పార్టీ కి గణనీయమైన ఓటు షేర్ ఉంది. అదే విధంగా తమిళనాడు లో కూడా ఉంది. కూటమి కట్టి పోటీ చేస్తే కచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం ఉంటుంది. అందుకే ఆ అవకాశాన్ని వదులుకోలేక విజయ్ కోరిన కోరికని నెరవేర్చడానికి కూడా NDA సుముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా డీల్ కూడా సెట్ అయిపోయిందని, విజయ్ రాబోయే రోజుల్లో కచ్చితంగా NDA లోకి చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. విజయ్ కి కూడా వేరే గత్యంతరం లేక ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేదు. విడాకుల వ్యవహారం , త్రిష తో సహజీవనం వ్యవహారం విజయ్ ని ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఇలాంటి సమయం లో కలిసి ఉంటే కలదు సుఖం కాన్సెప్ట్ ని అనుసరించడమే బెస్ట్ అని ఆ పార్టీ నేతలు కూడా అంటున్నారట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version