Homeఎంటర్టైన్మెంట్Tamannaah Bhatia: సౌత్ సినిమాల్లో హీరోయిన్స్ ని అలా చూపించడం నాకు అసలు నచ్చేది కాదు...

Tamannaah Bhatia: సౌత్ సినిమాల్లో హీరోయిన్స్ ని అలా చూపించడం నాకు అసలు నచ్చేది కాదు – తమన్నా

Tamannaah Bhatia: సౌత్ లో సినిమాలు చేసి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకోవడం , తద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టడం ఈమధ్య కాలం లో హీరోయిన్స్ కి సర్వ సాధారణం అయిపోయింది. కెరీర్ లో తదుపరి లెవెల్ కి వెళ్లే క్రమంలో బాలీవుడ్ కి వెళ్లడంలో తప్పు లేదు. కానీ అన్నం పెట్టిన అమ్మ రొమ్ము మీద కొట్టే విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఇక సౌత్ లో ఎలాగో మనకు సినిమా అవకాశాలు రావు, బాలీవుడ్ లోనే మన కెరీర్ అని ఫిక్స్ అయిపోయిన హీరోయిన్స్ మాత్రమే ఇలా మాట్లాడుంటారు, అలాంటి హీరోయిన్స్ లో ఒకరిగా తమన్నా కూడా చేరడం దురదృష్టకరమైన విషయం. రీసెంట్ గా ఈమె సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ పై చేసిన కొన్ని కామెంట్స్ పెను దుమారమే రేపుతున్నాయి.

ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ‘సౌత్ ఇండియా లో పురుషాధిపత్యం ఎక్కువ. హీరోయిన్స్ ని గౌరవంగా చూపించరు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఇండియన్ సినిమాల్లో పాటలు మరియు డ్యాన్స్ కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇది నేను కెరీర్ ప్రారంభం లోనే గమనించాను. బాలీవుడ్ లో అయితే కేవలం నటన తెలిసిన హీరోయిన్స్ కొందరు అయితే, అందాలను ఆరబోత చేయడం తెలిసిన హీరోయిన్లు కొందరు ఉన్నారు. నటన , అందాల ఆరబోత రెండు చేయగల హీరోయిన్స్ మాత్రమే ఇండస్ట్రీ లో సూపర్ స్టార్స్ గా ఎదిగి ఎక్కువ కాలం కొనసాగుతుంటారు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అంటూ తమన్నా నోటికి వచ్చినట్టు మాట్లాడుతోంది, మన సౌత్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రావడం లేదా?, వచ్చి విజయం సాధించడం లేదా?, రీసెంట్ గా ‘మా ఇంటి బంగారం’ పెద్ద హిట్ అయ్యింది , అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే కదా? అంటూ తమన్నా ని నిలదీస్తున్నారు.

తమన్నా ని సౌత్ ఇండియన్ దర్శక నిర్మాతలు చాలా గొప్పగా వాడుకునేవారు , ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేకపోయినా అవకాశాలు ఇచ్చారు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చి పెద్ద స్టార్ ని చేశారు. కానీ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తమన్నా పరిస్థితి ఏంటి?, కెరీర్ ముందుకు సాగడం కోసం ఆమె అడల్ట్ రేటెడ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటిస్తోంది. ఎలా ఉండే తమన్నా , బాలీవుడ్ కి వెళ్ళగానే ఎలా మారిపోయింది?, రెండు ఇండస్ట్రీల మధ్య వ్యత్యాసం ఆమెకు ఈపాటికి అర్థం అయిపోయి ఉండాలి, కానీ బాలీవుడ్ దృష్టిలో పడేందుకు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని తక్కువ చేయడం తల్లి పాలు తాగి రొమ్ము మీద కొట్టినట్టే అని అంటున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version