Tollywood : సినిమా అంటే ప్రతి ఒక అంశాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. హీరో నుంచి చిన్న నటుడి వరకు ప్రతి ఒక్కరు అవసరమే. అంతేకాదు సినిమా హిట్ అవ్వాలంటే ముఖ్యంగా కథ బాగుండాలి. ఈ కథ బాగుండాలి అంటే డైరెక్టర్ బాగుండాలి. అయితే ఇలా డైరెక్టర్ ని మెచ్చే వారు ఎక్కువగా ఉంటే.. కొందరు స్టార్లు మాత్రం ఒక డైరెక్టర్ పేరు చెబితే బాబోయ్ అంటున్నారాట? ఇంతకీ ఎవరంటే..
సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీని సంపాదించుకున్న స్టార్లు ప్రభాస్, బన్నీ, చరణ్ లు. వీరి రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరు నటించిన సినిమాలు జనాలను ఏ రేంజ్ లో అల్లాడిస్తుంటాయి. అలా వీరి ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు.
డిఫరెంట్ కాన్సెఫ్ట్ లను ఎంచుకునే ఈ నలుగురు కూడా ఓ డైరెక్టర్ పేరు చెబితే పారిపోతున్నారట. ఆయనతో సినిమా అంటేనే భయపడుతున్నారట. అయితే ఆ డైరెక్టర్ ఎవరో కాదు మొహర్ రమేష్. ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు ఈయన. ఈయనంటే ఈ నలుగురు స్టార్లకు భయమట. ఆల్రెడీ తారక్, ప్రభాస్ లకు కోలుకోని షాక్ ఇచ్చాడు ఈ డైరెక్టర్.
బిల్లా సినిమా కాస్త బెటర్ అనుకోవచ్చు. కానీ ఎన్టీఆర్ కు శక్తి సినిమాతో మరీ దారుణమైన ఫలితాలను అందించింది. ఇక బన్నీ చరణ్ లతో సినిమా చేయాలని చాలా సార్లు ట్రై చేశారట. కానీ వాళ్లు సైలెంట్ గా ఎస్కేప్ అయ్యారని టాక్. ఇప్పటికీ కూడా వీళ్ల డేట్స్ కోసం ట్రై చేస్తున్నారట. కానీ చరణ్-బన్నీ-ప్రభాస్ లు మాత్రం ఈయనతో సినిమా చేయమంటూ తెగేసి చెబుతున్నారని టాక్.