https://oktelugu.com/

Balayya As Host For Bigg Boss: ‘బిగ్ బాస్’ హోస్ట్ గా బాలయ్య : ఏ హీరో ఎలాంటి షో చేయాలంటే ?

Balayya As Host For Bigg Boss: ‘అన్ స్టాపబుల్, మీలో ఎవరు కోటేశ్వర్లు, బిగ్ బాస్’ ఇలా అన్నీ రకాల షోలతో మన స్టార్స్ యాంకరింగ్ లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఇంకా చాలా మంది హీరోలు ఇలాంటి హోస్ట్ రోల్స్ లో మన ముందుకి రాబోతున్నారు. నిజంగా ఇది బుల్లితెర పై ఉత్తేజకరమైన అంశం. అయితే, ఇప్పటివరకూ మన హీరోలు హోస్ట్ చేసిన షోలు చూసి ఎంజాయ్ చేసాం, […]

Written By:
  • Shiva
  • , Updated On : January 4, 2022 / 05:05 PM IST
    Follow us on

    Balayya As Host For Bigg Boss: ‘అన్ స్టాపబుల్, మీలో ఎవరు కోటేశ్వర్లు, బిగ్ బాస్’ ఇలా అన్నీ రకాల షోలతో మన స్టార్స్ యాంకరింగ్ లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఇంకా చాలా మంది హీరోలు ఇలాంటి హోస్ట్ రోల్స్ లో మన ముందుకి రాబోతున్నారు. నిజంగా ఇది బుల్లితెర పై ఉత్తేజకరమైన అంశం. అయితే, ఇప్పటివరకూ మన హీరోలు హోస్ట్ చేసిన షోలు చూసి ఎంజాయ్ చేసాం,

    Balayya As Host For Bigg Boss

    మరి భవిష్యత్తులో ఏ హీరో ఎలాంటి షో చేస్తే బాగుంటుందో సరదాగా చూద్దాం రండి

    1. జూనియర్ ఎన్టీఆర్ – వంటావార్పు

    వంటావార్పు అనగానే ఇదేదో తక్కువ స్థాయి అని అనుకోక్కర్లేదు. ఎన్టీఆర్ కి వంట బాగా వచ్చు. కాబట్టి.. తారక్ హోస్ట్ గా ఇలాంటి ‘వంట షో’ ఒకటి స్టార్ట్ చేస్తే ఆ ‘మజా’నే మజా. ఎలాగూ తారక్ అద్భుతంగా కుక్ చేస్తాడు, షో హోస్ట్ చేస్తూనే మధ్యమధ్యలో అప్పుడప్పుడు తారక్ కూడా వండొచ్చు. ప్రేక్షకులు తారక్ వండే వంటలను కూడా హ్యాపీగా చూడొచ్చు.

    2. బాలకృష్ణ – బిగ్ బాస్

    ‘బిగ్ బాస్’ దెబ్బకు టీఆర్పీ సెట్ లు పగిలిపోతున్నాయి. నిజంగా ఈ షో కి ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ హోస్ట్ మళ్ళీ దొరకలేదు. అయితే, బాలయ్య బాబు ‘బిగ్ బాస్’కి గానీ, హోస్ట్ గా చేస్తే మాత్రం అదిరిపోతోంది. ఇది సాధ్యమేనా ? అంటే చూడాలి.

    3. పవన్ కళ్యాణ్ – సత్యమేవ జయతే

    అప్పట్లో ఈటీవీలో అమీర్ ఖాన్ ది ‘సత్యమేవ జయతే’ అనే ప్రోగ్రామ్ వచ్చేది. కరెక్ట్ గా అలాంటి షోని పవర్ స్టార్ కూడా తెలుగులో చేస్తే చాలా బాగుంటుంది.

    4. రవితేజ – అన్ స్టాపబుల్ టాక్ షో

    రవితేజ కూడా అన్ స్టాపబుల్ లాంటి షోకి హోస్ట్ గా చెయ్యాలి. అప్పుడు షో నిండా పంచ్ లే పంచ్ లు ఉంటాయి.

    Also Read: బాలయ్య అన్ స్టాపబుల్ షో కి రానున్న ఆ హీరో… ఎవరో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా!

    5. విజయ్ దేవరకొండ – బిగ్ బాస్

    విజయ్ కూడా బిగ్ బాస్ షోకి హోస్ట్ చేస్తే ఒకరకంగా చాలా కొత్తగా ఉంటుంది. కొత్త రకంగా ఊపు కూడా వస్తుంది

    6. సమంత – ట్రావెల్ డైరీస్

    సమంత ఒక ట్రావెలింగ్ షోకి హోస్ట్ చేస్తే అదిరిపోతోంది. సామ్ కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆమె ట్రావెలింగ్ షో చేయాలి.

    ఇలా మన హీరోహీరోయిన్లు పలు షోలకు హోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది.

    Also Read: తమ రెమ్యునరేషన్ ను తిరిగి ఇచ్చేసిన 9 మంది స్టార్లు వీళ్ళే !

    Tags