https://oktelugu.com/

Srinu Vaitla : ‘కింగ్’ సినిమాలో ‘బ్రహ్మానందం’ పాత్రని ఆ సంగీత దర్శకుడిని ఉద్దేశించి తీసానన్న శ్రీను వైట్ల

Srinu Vaitla : నేటి తరం దర్శకులలో ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించగలిగే సత్తా ఉన్న దర్శకులలో ఒకరు శ్రీనువైట్ల.. ఈయన సినిమాలలోని కామెడీ పాత్రలు నేటి సోషల్ మీడియాలో మీమర్స్ కి మంచి స్టఫ్, వయస్సు తో తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఆయన కామెడీ ని సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా దుబాయి శ్రీను , వెంకీ , సొంతం , దూకుడు సినిమాల్లోని సన్నివేశాలు ఇప్పటికీ యూట్యూబ్ లో చూసుకొని పగలబడి నవ్వుకోవచ్చు. అలాంటి డైరెక్టర్ […]

Written By: , Updated On : February 12, 2023 / 09:53 AM IST
Follow us on

Srinu Vaitla : నేటి తరం దర్శకులలో ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించగలిగే సత్తా ఉన్న దర్శకులలో ఒకరు శ్రీనువైట్ల.. ఈయన సినిమాలలోని కామెడీ పాత్రలు నేటి సోషల్ మీడియాలో మీమర్స్ కి మంచి స్టఫ్, వయస్సు తో తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఆయన కామెడీ ని సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా దుబాయి శ్రీను , వెంకీ , సొంతం , దూకుడు సినిమాల్లోని సన్నివేశాలు ఇప్పటికీ యూట్యూబ్ లో చూసుకొని పగలబడి నవ్వుకోవచ్చు.

అలాంటి డైరెక్టర్ నేడు వరుస ఫ్లాప్స్ తో ఢీలా పడడంతో అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. కొంతమంది స్టార్ హీరోలను కలిసి కథలు చెప్పిన కూడా శ్రీను వైట్ల తో పని చెయ్యడానికి సుముఖంగా లేరు. అయితే కొద్ది రోజుల క్రితం శ్రీను వైట్ల ఇచ్చిన ఇంటర్వ్యూ లో తానూ కింగ్ సినిమాలోని బ్రహ్మానందం పాత్రని తయారు చేయడానికి ఆదర్శం ఎవరో చెప్పి అందరినీ షాక్ కి గురి చేసాడు.

ఆయన మాట్లాడుతూ ‘చాలా మంది ‘కింగ్’ సినిమాలోని బ్రహ్మానందం జయసూర్య పాత్రని చక్రి ని ఉద్దేశించి తీశానని తప్పుగా ప్రచారం చేసారు.అది ముమ్మాటికీ నిజం కాదు, చక్రి నా ‘ఢీ’ చిత్రానికి పని చేసాడు, చాలా గొప్ప ప్రతిభ ఉన్న సంగీత దర్శకుడు. కొన్ని సినిమాలకు నేను అతనికి పారితోషికం ఇవ్వలేకపోయినా నా మీద ఇష్టంతో మళ్ళీ నాతో పని చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి గొప్ప మనిషి గురించి నేనెందుకు తప్పుగా చూపిస్తాను. నేను ఆ పాత్ర ని వేరే సంగీత దర్శకుడికి సెటైర్ గా తీసాను, అది వేరేలా వెళ్ళింది.రామజోగయ్య శాస్త్రి గారు అప్పుడే ఇండస్ట్రీ లోకి కొత్తగా వచ్చిన రచయిత, అతనిని నా వెంట తీసుకొని ఒక ప్రముఖ సంగీత దర్శకుడి దగ్గరకి వెళ్ళాను.అతనితో మ్యూజిక్ సిట్టింగ్ వెయ్యగానే ‘అరేయ్ శాస్త్రి..ఇలా రాయిరా’ అనగానే నేను షాక్ కి గురయ్యాను, ఏదో తన దగ్గర సంవత్సరాల తరబడి పని చేస్తున్న పనివాడిలెక్క అతను ట్రీట్ చేసిన విధానం నాకు ఏమాత్రం నచ్చలేదు.. అందుకే అతనికి సెటైర్ వేస్తూ జయసూర్య పాత్ర సృష్టించాను’ అంటూ చెప్పుకొచ్చాడు శ్రీను వైట్ల.

మరి ఆ సంగీత దర్శకుడు ఎవరన్నది మాత్రం శ్రీను వైట్ల బయటపెట్టలేదు. అయితే అది అర్థమవ్వాల్సిన వారికి మాత్రం అర్థమైందని అంటున్నారు.