Adavi Sesh director srinu vaitla : కర్మ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడవి శేష్ హీరోగా పరిచయమై ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా గొప్పగా రాణించి మళ్ళీ హీరో గా మారి క్షణం , గూడాచారి, ఎవరు మరియు మేజర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు..అడవి శేష్ సినిమా అంటే ఇప్పుడు A సెంటర్స్ ఆడియన్స్ క్యూ కట్టేస్తున్నారు.
థ్రిల్లర్ జానర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అడవి శేష్ మార్కెట్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది..ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 2’ ..న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన హిట్ అనే బ్లాక్ బస్టర్ సినిమాకి ఇది సీక్వెల్..ఈ సినిమాకి కూడా నాని నిర్మాతగా వ్యవహరించాడు..టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసిన ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ హీరో రేంజ్ ని తలపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న అడవి శేష్ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.. ఇక అసలు విషయానికి వస్తే.. అడవి శేష్ మొట్టమొదటి సినిమా శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘సొంతం’ సినిమా అట.. ఇందులో నమితని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఫారిన్ అబ్బాయిగా అడవి శేష్ కనిపిస్తాడు.. అయితే ఈ సినిమాలో ముందుగా అడవి శేష్ కి హీరో తో సరిసమానమైన పాత్ర అని చెప్పి ఒప్పించాడట డైరెక్టర్ శ్రీను వైట్ల.
ఇది హిందీ లో ‘దిల్ చాహతా హై’ వంటి ముగ్గురు హీరోల కథ అని..నీకు మంచి పేరు వస్తుందని చెప్పి మూడు రోజుల్లోనే నా పాత్ర షూటింగ్ మొత్తం పూర్తి చేసి పంపేశారు..దానికి నేను చాలా హార్ట్ అయ్యానని..అందుకే సొంతం సినిమాని ఇప్పటికి కూడా చూడలేదని చెప్పుకొచ్చాడు అడవి శేష్.