Sreeja – Kalyan Dev : మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేసిన కళ్యాణ్ దేవ్..శ్రీజా ని ఉద్దేశిస్తూ సెటైర్లు!

Sreeja – Kalyan Dev : మెగాస్టార్ చిరంజీవి రెండవ కూతురు శ్రీజా కళ్యాణ్ దేవ్ అనే అతనిని రెండవ పెళ్లి చేసుకోవడం, గత రెండేళ్ల నుండి వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్త సోషల్ మీడియా లో భారీ గా ప్రచారం అవ్వడం వంటివి మనం గమనిస్తూనే ఉన్నాం. దీని గురించి అటు మెగా ఫ్యామిలీ కానీ,ఇటు కళ్యాణ్ దేవ్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియా లో దీని గురించి రోజుకి ఒక […]

Written By: NARESH, Updated On : April 18, 2023 10:34 pm
Follow us on

Sreeja – Kalyan Dev : మెగాస్టార్ చిరంజీవి రెండవ కూతురు శ్రీజా కళ్యాణ్ దేవ్ అనే అతనిని రెండవ పెళ్లి చేసుకోవడం, గత రెండేళ్ల నుండి వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్త సోషల్ మీడియా లో భారీ గా ప్రచారం అవ్వడం వంటివి మనం గమనిస్తూనే ఉన్నాం. దీని గురించి అటు మెగా ఫ్యామిలీ కానీ,ఇటు కళ్యాణ్ దేవ్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.

కానీ సోషల్ మీడియా లో దీని గురించి రోజుకి ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది.మెగా ఫ్యాన్స్ కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ లో పెట్టే ప్రతీ పోస్ట్ క్రింద కామెంట్ బాక్స్ లో నెగటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.ఇలా గత రెండేళ్ల నుండి జరుగుతూనే ఉంది, కానీ కళ్యాణ్ దేవ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు,కానీ రీసెంట్ గా ఆయన పెట్టిన ఒక పోస్ట్ మెగా ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసినట్టు గా అనిపిస్తుంది.

ఆయన మాట్లాడుతూ ‘నేను ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నానో,ఎన్ని బాధలు పడుతున్నానో, మానసికంగా ఎంత కృంగిపోయానో, మీకు తెలిసింది గోరంత, తెలియనిది కొండంత’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అంతకు ముందు కూడా ఆయన తన కూతురుని మిస్ అవుతున్నట్టు గా ఒక పోస్టు పెట్టాడు.

ఇదంతా గమనిస్తూ ఉంటే కళ్యాణ్ దేవ్ శ్రీజా తో విడిపోయినప్పటి నుండి ఇన్ని కష్టాలను బాధలను అనుభవిస్తున్నాడా..? , కనీసం కూతురు కోసం అయినా వీళ్లిద్దరు ఒకటి అయిపోవచ్చు గా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరో పక్క కళ్యాణ్ దేవ్ రీసెంట్ గా పెట్టిన పోస్టు తనపై నెగటివ్ కామెంట్స్ చేసిన వారిని ఉద్దేశించి చేస్తున్నట్టుగా కూడా కొంతమందికి అనిపించింది.దీనిపై మళ్ళీ ఆయన రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.