https://oktelugu.com/

Software engineers : సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు శృంగార కోరికలు ఎక్కువనా? తక్కువనా?సర్వేలో విస్తుపోయే విషయాలు

Software Engineers : మంచి జీతం.. అప్పుడప్పుడు బోనస్.. ప్రతిభ సాధిస్తే అదనపు బహుమతులు.. వీకెండ్ హాలీడే.. అవసరమైతే ఫారిన్ టూర్.. ఇలాంటి అద్భుతమైన సౌకర్యాలు కేవలం సాఫ్ట్ వేర్ ఉద్యోగంలోనే ఉంటాయి. కొంచెం టెక్నికల్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి..  కంప్యూటర్ పై అవగాహన పెంచుకుంటే చాలు సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకుపోవచ్చు. అయితే ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతున్నందున సంబంధిత సబ్జెక్ట్ పై పట్టు సాధించాలి. అయితే కొన్ని ప్రత్యేక కోర్సులు సాఫ్ట్ వేర్ జాబ్ […]

Written By: , Updated On : October 23, 2022 / 10:41 AM IST
Follow us on

Software Engineers : మంచి జీతం.. అప్పుడప్పుడు బోనస్.. ప్రతిభ సాధిస్తే అదనపు బహుమతులు.. వీకెండ్ హాలీడే.. అవసరమైతే ఫారిన్ టూర్.. ఇలాంటి అద్భుతమైన సౌకర్యాలు కేవలం సాఫ్ట్ వేర్ ఉద్యోగంలోనే ఉంటాయి. కొంచెం టెక్నికల్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి..  కంప్యూటర్ పై అవగాహన పెంచుకుంటే చాలు సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకుపోవచ్చు. అయితే ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతున్నందున సంబంధిత సబ్జెక్ట్ పై పట్టు సాధించాలి. అయితే కొన్ని ప్రత్యేక కోర్సులు సాఫ్ట్ వేర్ జాబ్ చేయడానికి దారులు చూపిస్తున్నాయి. చాలా మంది యువత వీటిని ఆశ్రయిస్తూ ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు.  మిగతా వారి కంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల లైఫ్ కాస్త భిన్నంగానే ఉంటుంది. వారికుంటే స్ట్రెచ్ తో రిలీప్ కోసం ఖర్చు కూడా ఎక్కువగానే పెడుతారు. ఈ క్రమంలో వారిలో శృంగార కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయట.

ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని యువతులు పట్టుబట్టేవారు. అందం, ఆస్తులు లేకపోయినా ఈ  రంగంలో ఉద్యోగం ఉంటే చాలు.. ఇక లైఫ్ సెటిలైపోవచ్చు అని భావించేవారు. అయితే ఇందులో పోటీ రావడంతో పాటు కొన్ని టెక్నికల్ ఇష్యూష్ ఉండడంతో సాఫ్ట్ వేర్ కు వెళ్లేందుకు కొందరు భయపడుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగ భద్రతకు ఎలాంటి హామీ ఉండకపోవడంతోనూ ఇతర రంగాలను చూసుకుంటున్నారు. అయితే కొందరు అవకాశాలు విదేశాల్లో ఉన్నా అక్కడికి వెళ్లేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు.

కొన్ని అధ్యయనాల ప్రకారం.. మిగతా ఉద్యోగస్తుల కంటే సాఫ్ట్ వేర్ రంగలోని వారికి ఎక్కువగా సెక్స్ కోరికలుంటాయని వెల్లడైంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వాస్తవమే అని ధ్రువీకరించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వారానికి 5 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. ఈ వారం రోజులు ప్రతిరోజు 18 నుంచి 20 గంటలు చేయాల్సి రావొచ్చు. ఉదయం, సాయంత్రం అని తేడా లేకుండా ప్రాజెక్ట్ పూర్తి చేసేవరకు నిద్రపోరు. ఈ క్రమంలో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఇలాంటి స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావడానికి కొన్ని వ్యసనాలకు అలవాటు పడుతారు.

మిగతా వారి కంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో చాలా మంది వ్యసనాల బారినపడిన వారు ఎక్కువగానే ఉంటారు. ఒత్తిడి నుంచి తట్టుకునేందుకు మద్యం, ధూమపానం లాంటివి ఆశ్రయిస్తారు. ఈక్రమంలో వారు సెక్స్ పై కూడా ఇంట్రెస్ట్ పెడుతారు. శృంగారం కూడా ఒక వ్యసనంలా భావించి అందులో పాల్గొంటే రిలీఫ్ గా ఉంటుందని భావిస్తారు. అంతేకాకుండా శృంగారం ఆరోగ్యకరం.. అన్నారు. దీంతో  కొందరు ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోవడానికి మిగతా వ్యసనాల కంటే సెక్స్ లో పాల్గొనడమే ఉత్తమని అనుకుంటారు.

అయితే అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ వ్యసనం  ఒకసారి అలవాటు అయితే సామాన్యంగా విడిచిపెట్టదు. శృంగారంలో ఒకసారి తృప్తి పొందితే మళ్లీ మళ్లీ కావాలని అనిపిస్తుంది. సైకాలజీ ప్రకారం దొరకని వస్తువునే ఎక్కువగా కావాలని కోరుకుంటాం. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వారంలో రెండు రోజులు మాత్రమే సెక్స్ లో పాల్గొనడానికి వీలవుతుంది. మిగతా రోజుల్లో బీజీగా ఉండి కుదరదు. ఈ క్రమంలో వారాంతం వరకు సెక్స్ లో పాల్గొనకుండా ఉండడం వల్ల  వారిలో కోరికలు బలంగా ఏర్పడుతాయి. ఆ సమయం రాగానే వారు రెచ్చిపోతారు.