https://oktelugu.com/

Sruthi Haasan : షూటింగ్ స్పాట్ లో శృతి హాసన్ కి తీవ్రమైన గాయాలు..భయాందోళనకు గురించి చేస్తున్న ఫోటోలు

Sruthi Haasan : స్టార్ హీరో కుమార్తె గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినంత మాత్రాన స్టార్ హీరోయిన్ అయిపోవాలని రూల్ లేదు.దానికి ఎంతో కష్టపడాలి, తనకంటూ ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉండాలి, అప్పుడే ఇండస్ట్రీ లో నెగ్గుకురాగలరు అని నిరూపించింది కమల్ హాసన్ కూతురు శృతి హాసన్.ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది ఈమె.బాలీవుడ్ మరియు టాలీవుడ్ లలో తన మొదటి చిత్రాలు దారుణంగా ఫ్లాప్స్ అయ్యాయి.చాలా మంది ఈమెను […]

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2023 / 10:20 PM IST
    Follow us on

    Sruthi Haasan : స్టార్ హీరో కుమార్తె గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినంత మాత్రాన స్టార్ హీరోయిన్ అయిపోవాలని రూల్ లేదు.దానికి ఎంతో కష్టపడాలి, తనకంటూ ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉండాలి, అప్పుడే ఇండస్ట్రీ లో నెగ్గుకురాగలరు అని నిరూపించింది కమల్ హాసన్ కూతురు శృతి హాసన్.ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది ఈమె.బాలీవుడ్ మరియు టాలీవుడ్ లలో తన మొదటి చిత్రాలు దారుణంగా ఫ్లాప్స్ అయ్యాయి.చాలా మంది ఈమెను ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేసేవారు ఆరోజుల్లో.

    అయినప్పటికీ కూడా ఏమాత్రం ఆత్మ విశ్వాసం ని కోల్పోకోకుండా తన టాలెంట్ తో అవకాశాలను సంపాదిస్తూ హిట్టు మీద హిట్టు కొడుతూ, సౌత్ ఇండియాలో ప్రతీ స్టార్ హీరో సరసన హీరోయిన్ గా నటించి నేడు తిరుగులేని స్టార్ గా ఎదిగింది శృతి హాసన్.ఎంతమంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ కి వస్తున్నప్పటికీ కూడా , ఆమె డిమాండ్ ఇప్పటికీ ఇసుమంత కూడా తగ్గలేదు.

    రీసెంట్ గా ఆమె సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలలో హీరోయిన్ గా నటించి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది.కెరీర్ పరంగా ఎంత బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నా కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికీ టచ్ లోనే ఉంటుంది.తనకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటుంది శృతి హాసన్.రీసెంట్ గా మోకాలికి గాయమైన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో అప్లోడ్ చేసింది.

    ఆ గాయాలను చూసి అభిమానులకు భయం వేసి ఉండొచ్చు కానీ, శృతి హాసన్ కి మాత్రం వెయ్యలేదు.’ఈరోజు నేను చాలా మంచి పని చేశాను’ అంటూ గాయాలైన తన మోకాలికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.కాస్త ఒంటి మీద, ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాలి అంటూ అభిమానులు ఆమెకి సోషల్ మీడియా ద్వారా జాగ్రత్తలు చెప్తున్నారు.