https://oktelugu.com/

Kicha Sudeep Meena: స్టార్ హీరోతో సీనియర్ హీరోయిన్ రహస్య వివాహం.. వీరిబంధంపై షాకింగ్ నిజాలు?

Kicha Sudeep Meena: మీనా.. ఒకప్పుడు దక్షిణాదిలో అగ్రహీరోలందరితో నటించి మెప్పించిన నటి. తెలుగులో వెంకటేశ్, నాగార్జున సహా తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ ఈ స్టార్లతో జోడీ కట్టి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. 40 ఏళ్లుగా సినీ రంగంలో తన ప్రయాణం కొనాసగిస్తోంది. మీనా తల్లి మల్లి కూడా నటియే కావడంతో కూతురును ప్రోత్సహించింది. 1990లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 2009 వరకూ సినిమాలో నటించింది మీనా. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2022 / 04:28 PM IST
    Follow us on

    Kicha Sudeep Meena: మీనా.. ఒకప్పుడు దక్షిణాదిలో అగ్రహీరోలందరితో నటించి మెప్పించిన నటి. తెలుగులో వెంకటేశ్, నాగార్జున సహా తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ ఈ స్టార్లతో జోడీ కట్టి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. 40 ఏళ్లుగా సినీ రంగంలో తన ప్రయాణం కొనాసగిస్తోంది.

    మీనా తల్లి మల్లి కూడా నటియే కావడంతో కూతురును ప్రోత్సహించింది. 1990లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 2009 వరకూ సినిమాలో నటించింది మీనా. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ఎంతోమందితో ఎఫైర్ నడిపినట్టు వార్తలు వచ్చాయి. సౌత్ ఇండియాలో ఒకప్పుడు ఆమె పెళ్లి ఒక స్టార్ హీరోతో రహస్యంగా అయిపోయిందని.. అందులో షాకింగ్ నిజాలను కథలు కథలుగా రాశారు.

    కన్నడ స్టార్ హీరో సుదీప్ తో నటి మీనా పెళ్లి అయిపోయినట్టుగా 2006లో బోలెడన్నీ వార్తలు వచ్చాయి. 2003లో తొలిసారి కలిసి నటించిన వీరిద్దరూ 2006లో ‘మై ఆటోగ్రాఫ్’ సినిమాలో నటించారు. ఈ షూటింగ్ లోకేషన్ లోనే ప్రేమలో పడి రహస్యంగా పెళ్లి చేసుకున్నారని శాండిల్ వుడ్ కోడైకూసింది.

    ఈ క్రమంలోనే మీనా ఈ వార్తలపై స్పందించింది. నాకు మీడియా మూడోసారి పెళ్లి చేసిందని.. తాను, సుదీప్ కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని.. మేం ఇద్దరం కలిసి కేవలం రెండే సినిమాల్లో నటించామని.. నేను పెళ్లి చేసుకుంటే మీడియాకు ఖచ్చితంగా చెబుతానంటూ మీనా స్పష్టం చేసింది. ఇక సుదీప్ కూడా మీనాతో తన పెళ్లి వార్తలను కొట్టిపారేశాడు. మీనాతో నా రహస్య వివాహంలో నిజం లేదన్నారు.

    ఇలాంటి గాసిప్స్ ఎక్కువ కావడంతో మీనాకు వాళ్ల ఇంట్లో ఒక మంచి సాఫ్ట్ వేర్ సంబంధం చూసి పెళ్లి చేశారు. వీరికి పిల్లలు కలిగారు. దురదృష్టవశాత్తూ ఇటీవలే మీనా భర్త మరణించాడు.

    కాగా మీనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. దృశ్యం మూవీలో మెయిన్ రోల్ పోషిస్తూ మలయాళం, తెలుగులోనూ నటించింది. ఈ సినిమాతో మరోసారి మీనాకు మంచి గుర్తింపు లభించింది.