Senior Actress Sudha: సీనియర్ నటి సుధ అనగానే ఎన్నో వందలాది చిత్రాల్లో ఆమె చేసిన అత్త, అమ్మ, వదిన పాత్రలు గుర్తుకు వస్తాయి. ఏ పాత్రలో నటించినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సహజ నటి సుధ గారు. నిజానికి ఆమె బాలనటిగా అప్పట్లో బాగా పేరు తెచ్చుకున్నారు. అలాగే పద్నాలుగేళ్ల వయసులోనే హీరోయిన్ గానూ కొన్ని సినిమాల్లో నటించి అలరించారు. ఆ తర్వాత అత్తగా, అమ్మగా ఒదిగిపోయారు.
తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సుధ గారు.. పర్సనల్ లైఫ్ లో చాలా ఇబ్బందులు పడ్డారు. కాగా తాజాగా ఆమె తన జీవితంలోని ఒడిదుడుకులను కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చింది. సుధా గారు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇన్నేళ్ల నా కెరీర్ లో చాలా సంపాదించాను. అలాగే కొన్ని బిజినెస్ లు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకున్నాను కూడా. ఢిల్లీలో నేను ఒక హోటల్ పెట్టాను. లాభం వచ్చింది.
Also Read: కంగనా రనౌత్ పోస్టులు సెన్సార్ చేయలేం – సుప్రీంకోర్టు
దాంతో మరో హోటల్ పెట్టాను. అన్నీ నష్టాలు వచ్చాయి. నిండా మునిగిపోయాను. అంతలో మా నాన్నగారు పోయారు. ఆయన పోయాక లైఫ్ అంటే ఏంటో నాకు తెలిసొచ్చింది. ప్రస్తుతం నేను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. నాకు మనుషుల్ని నమ్మకూడదని ఇప్పుడే అర్థమైంది. మా నాన్న గారికి క్యాన్సర్ అనగానే మా బంధువులంతా దూరం అయిపోయారు. నిజానికి నా భర్త, కొడుకులు కూడా నాకు దూరంగా ఎక్కడో యూఎస్‌లో ఉంటున్నారు.
కానీ వాళ్లకూ ఏదో ఒక రోజు నా పరిస్థితే వస్తుంది. నా భర్త, నా కొడుకు ఈ వీడియో చూస్తారు. అయినా వాళ్ళు నా గురించి ఆలోచించరు. బహుశా నా జీవితంలోని చేదును వాళ్ళు ఇష్టపడరు. అయినా, అమ్మ ప్రేమను అర్ధం చేసుకోలేని పిల్లలు ఉంటే ఎంత ? లేకపోతే ఎంత ? చాలామందికి తెలియక పోవచ్చు.. మాతృదేవోభవ సినిమాలోని చాలా సంఘటనలు నా నిజ జీవితంలో నిజంగా జరిగాయి’ అంటూ సుధ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను కదిలించింది.
Also Read: ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు ఎన్టీఆర్ ప్లాన్ !