Aadi Saikumar: ఆది సాయికుమార్ కామెడీ చేస్తున్నాడు. ఇక పై మనసుకు నచ్చిన కథలతోనే సినిమాలు చేస్తాను అంటూ తాజాగా ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు. అంటే ఏమిటి ? ఇప్పటివరకు ఆది బాబు మనసుకు నచ్చకుండా సినిమాలు చేశాడా ? ఇక నుంచి జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళ్తాను అంటే బాగుండేది. అంతేగాని, ఇక నుంచి మనసుకు నచ్చాలి, ఆఫీస్ బాయ్ కి నచ్చాలి అంటే దరిద్రంగా ఉంటుంది.
అయినా, ఆది సాయికుమార్ చిత్రాలన్నీ బాగా నిరాశపరిచాయి అంటే.. దానికి కారణం ఆయనే. కథల విషయంలో మొదట్లో వేళ్ళు పెట్టాడు, ప్లాప్ లు వచ్చాయి. ఆ భయంతో ఆ తర్వాత కాళ్లు కూడా పెట్టాడు, ఇక అప్పటి నుంచి డిజాస్టర్లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ వారం రాబోతున్న ‘అతిథి దేవో భవ’’ సినిమా కూడా మరో డిజాస్టర్ అని ఆల్రెడీ టాక్ వచ్చింది.
‘ఆది’ గత చిత్రాల్లో ‘చుట్టాలబ్బాయి’, ‘రఫ్’ లాంటి సినిమాల కథలు బాగానే ఉంటాయి. కానీ ఆ సినిమాలు కూడా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. కారణం అనవసరమైన ఫైట్లు. అలాగే, ఓవర్ బిల్డప్ యాక్షన్ షాట్స్. తన సినిమాల్లో ఈ ఫైట్లు, యాక్షన్ షాట్స్ ఉండేలా ఆది మొదటి నుంచి అతి జాగ్రత్త తీసుకుంటూ వచ్చాడు.
Also Read: చరణ్ పానిపూరి, రాజమౌళి బిర్యానీ.. మరి ఇంతకీ ఎన్టీఆర్ ఏమిటి ?
గొప్ప స్టార్ హీరో అయిపోవాలని ఆది ఆశ. స్టార్ అవ్వాలంటే యాక్షన్ ఉండాల్సిందే అని అతని అపోహ. మొత్తమ్మీద ఏదేదో చేసేసి.. ఇక నుంచి మనసుకు నచ్చిన కథలే చేస్తాను అంటే సినీ జనం నవ్వుకుంటున్నారు. అసలు మనసుకు నచ్చినట్లు చేసే కదా.. ఈ పరిస్థితి తెచ్చుకున్నావ్ అంటూ ఆది పై కామెంట్లు చేస్తున్నారు. మరి ఆది ఇప్పటికైనా అర్థం చేసుకుని మారితే.. బాగుంటుంది.
ఇక ఆది నటించిన తాజా సినిమా ‘అతిథి దేవో భవ’’. ఈ సినిమాను పొలిమేర నాగేశ్వర్ డైరెక్ట్ చేశాడు. రాజాబాబు మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల ఈ సినిమాని నిర్మించారు. నువేక్ష కథానాయిక. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also Read: సెకెండ్ వీక్ లోనూ అదరగొట్టిన ‘శ్యామ్ సింగ రాయ్’ !