Sankranthi Movies 2026: సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో జానర్ సినిమాలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. గత కొద్ది రోజుల నుంచి యాక్షన్ ఎలివేషన్స్ తో కూడిన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో థ్రిల్లర్ సినిమాలు సైతం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు సంక్రాంతి సినిమాలు కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ లను సాధించాయి. కాబట్టి మరోసారి ఇండస్ట్రీలో కామెడీ సినిమాల హవా కొనసాగుతుందనే చెప్పాలి. ఇక మీదట వచ్చేవన్నీ కామెడీ సినిమాలే కావడం విశేషం…గతంలో అల్లరి నరేష్ కామెడీ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించేవాడు. కానీ ఆ తర్వాత కాలంలో కామెడీ సినిమాలకు కాలం చెల్లిపోయింది. అందుకే కామెడీ సినిమాలను ఎవరు పట్టించుకునేవారు లేకుండా పోయారు.
ఇప్పుడు మాత్రం మరోసారి నవ్వులు పూయించడానికి హీరోలు సిద్ధమైతే వాటిని చూసి ఎంజాయ్ చేయడానికి ప్రేక్షకులు సైతం సన్నద్ధమవుతున్నారు. ఇకమీదట రాబోయే సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయి… ఇక మరోసారి కామెడీ కథలకు ప్రాణం వచ్చినంత పనైంది. ఈ సంక్రాంతికి వచ్చిన నాలుగు కామెడీ సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో ప్రేక్షకుల ఆలోచన ధోరణి మారిందని మేకర్స్ సైతం భావిస్తున్నారు.
ఇక ఇప్పుడు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా కామెడీ సినిమాలకు పెద్ద పీట వేసే సినిమాలకు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ ఆదరణ దక్కుతుందనేది వాస్తవం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రానటువంటి గుర్తింపు ఒక సక్సెస్ ఫుల్ సినిమాని సాధించిన వాళ్లకు మాత్రం వస్తుంది.
శర్వానంద్ లాంటి మీడియం రేంజ్ హీరో సైతం గతంలో ఎక్స్పరిమెంట్లు చేసి చేతులు కాల్చుకున్నాడు. కామెడీ సినిమాలను నమ్ముకున్న తర్వాతే తనకు సక్సెస్ అయితే దక్కింది. ‘ నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో సక్సెస్ ని సాధించిన ఆయన తన తదుపరి సినిమాల్లో సైతం కామెడీ ఎక్కువగా ఉండే విధంగా చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…
