Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పెను సంచలనాన్ని సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఆ తర్వాత ఆయన చేసిన ‘కబీర్ సింగ్’, ‘అనిమల్’ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే సందీప్ రెడ్డి వంగ ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడిగా మారిపోతాడు. ఇక ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ నుంచి వచ్చే సినిమాల విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉంటున్నాడు అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?
ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను సృష్టిస్తున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికి సందీప్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాలో కొన్ని సన్నివేశాలైతే బోల్డ్ గా ఉండబోతున్నాయట.
మరి ప్రభాస్ ని సైతం ఆ సన్నివేశాల్లో నటించమని తను ఫోర్స్ చేస్తున్నాడు. ప్రభాస్ మాత్రం దానికి చాలా మొహమాటపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఆ సన్నివేశాలు సినిమాలో ఉంటేనే ప్రేక్షకులకు బాగా ఇంపాక్ట్ ఉంటుందని ఆ సీన్స్ వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని సందీప్ అయితే అనుకుంటున్నాడట. ఇక ప్రభాస్ సైతం ఆ సన్నివేశాలను చేయడానికి సిద్ధమవుతున్నాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
గతంలో సందీప్ రెడ్డి వంగ చేసిన సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఉంది. ఇక స్పిరిట్ సినిమా స్టార్ట్ చేయడానికి ముందే ప్రభాస్ ఐతే కొన్ని కండిషన్స్ పెట్టాడట. ఆ కండిషన్స్ ని సందీప్ ఒప్పుకున్న తర్వాత సినిమా స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి ఆ బోల్డ్ సీన్స్ లో నటించాలని సందీప్ కండిషన్స్ పెట్టడం పట్ల ప్రభాస్ సైతం కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…
