తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అంటే తెలియని వారుండరు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని టీడీపీలో చంద్రబాబుకు అనుయాయుడిగా వ్యవహరించేవారు. రాష్ట్ర విభజన సమయం వరకు ఆయన టీడీపీలోనే ఉంటూ పార్టీ కోసం ఎన్నో సమస్యల్లో ఇరుక్కున్నాడు. అయినా పార్టీని వీడలేదు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత మోత్కుపల్లి నర్సింహులు పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాడా..? అనే చర్చ సాగుతోంది.
Also Read: విశాఖ మెట్రో ప్రారంభం..
చంద్రబాబుపై వచ్చే ప్రతి విమర్శను తిప్పికొడుతూ నిత్యం వార్తల్లో ఉండే ఆయన ఇప్పుడు కనీసం ప్రెస్‌మీట్‌లో కూడా కనిపించడం లేదు. 2014లో విభజన ఆంధ్రలో టీడీపీ విజయం సాధించడంతో కనీసం నామినేటెడ్ పోస్టు వస్తుందని ఆశించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి పదవి ఆశించిన ఆయనను చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో తీవ్రంగా నిరాశ చెందారు. మూడుసార్లు మంత్రిగా పనిచేసిన ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని చంద్రబాబుపై విమర్శలు చేశారు. దీంతో పార్టీ ఆయనను బహిష్కరించింది.
Also Read: ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్..