Samantha Ruth Prabhu : హాట్, స్వీట్ బ్యూటీ సమంత గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు మంచి పాజిటివ్ టాక్ తో దూసుకొని పోవడమే కాకుండా థియేటర్ల వద్ద మంచి కలెక్షన్లు కూడా రాబడుతుంటాయి. దీంతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. రీసెంట్ గా కొన్ని ఫ్లాప్ ను సొంతం చేసుకున్న సమంత యశోద, ఖుషీ సినిమాలతో పుంజుకుంది. ఖుషీ సినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. కానీ ప్రస్తుతం ఈ అమ్మడు ఏ సినిమాలో నటించడం లేదు.
సమంత రీసెంట్ గా ఓ సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాను అంటూ తెలిపింది. ఆ తర్వాత ట్రీట్మెంట్ కోసం వెళ్లిందట. అంతేకాదు విదేశాల్లో పర్యటిస్తూ ఈమె చేసిన పోస్టులు కూడా చాలా వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని తొందరగానే విడిపోయింది. ఆ తర్వాత సమంత, నాగచైతన్య అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద సునామీనే సృష్టించారు. ఇక ఈ వార్ ముగిసినప్పటికీ సామ్, చైతు లు చేసే కొన్ని పోస్టులు మాత్రం వైరల్ గా మారుతుంటాయి. ప్రస్తుతం సమంత చేసిన ఓ పోస్టు మరోసారి వైరల్ గా మారింది.
తాజాగా సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సందర్బంగా తన వైవాహిక జీవితం గురించి కూడా కామెంట్లు చేసింది. తను చేసిన అతి పెద్ద తప్పు గురించి తెలిపింది. అదేంటి అనుకుంటున్నారా? నా ఇష్టాఇష్టాలను గుర్తించడంలో విఫలం అయ్యానని.. దానిని చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని.. వాటిని తన భాగస్వామి ప్రభావితం చేశారని తెలిపింది సామ్. క్లిష్ట సమయం నుంచే మనం విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైందని పేర్కొంది. ఈ విషయం గ్రహించిన తర్వాతే తన ఎదుగుదల మొదలైందని చెప్పింది సామ్.
గతంలో ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. విడాకులు, వరుస ఫ్లాప్ లు, ఆరోగ్య సమస్యలు ఒకదాని వెంట ఒకటి రావడంతో చాలా కుంగిపోయాను అని తెలిపింది సమంత. మొత్తం మీద ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించిన ఈ భామ తిరిగి ఎప్పుడు నటిస్తుంది అంటూ ఎదరుచూస్తున్నారు ఆమె అభిమానులు.