Samantha: నేటి తరం స్టార్ హీరోయిన్స్ లో శారీరకంగా కానీ , మానసికంగా కానీ సమంత పడినంత వేదన , ఏ స్టార్ హీరోయిన్ కూడా పడలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లాడిన ఆమె , కొన్ని అనుకోని కారణాల వల్ల అతనితో విడిపోయినప్పుడు చాలా మానసిక వేదనకు గురైంది. ఆ సమయం లో తన ద్రుష్టి మరలించుకోవడానికి హద్దులు మీరిన వర్కౌట్స్ చేసింది. ఆ క్రమంలోనే ఆమెకు మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా సమంత పెద్ద నరకమే చూసింది. అప్పుడే ఆమెకు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చింది. కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తుంది అని అనుకుంటున్న సమయంలో ఈ వ్యాధి సోకడం వల్ల ఆమె సినీ కెరీర్ కి కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.
కొన్నేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం , రాజ్ నిడిమోరు ని పెళ్ళాడి కొత్త జీవితం మొదలు పెట్టడంతో సమంత జీవితం గాడిలో పడింది అని అంతా అనుకున్నారు. రీసెంట్ గానే ఆమె గర్భం కూడా దాల్చడం అభిమానులకు గుడ్ న్యూస్. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘మా ఇంటి బంగారం’ డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడిన మాటలు, ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ మాటలు విన్నాక , అయ్యో పాపం సమంత అని అనిపించక తప్పదు. ఆమె మాట్లాడుతూ ‘మయోసిటిస్ కారణంగా సమంత రెండేళ్ల పాటు ఉప్పు, రుచి లేని కఠినమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ డైట్ అనుసరిస్తూ వచ్చింది. ఆమెకు మయోసిటిస్ వ్యాధి నుండి ఇంకా పూర్తిగా విముక్తి లభించలేదు. వ్యాధి తీవ్రత పెరగకుండా నిత్యం ఆమె ఆహార నియమాలు పాటించాల్సిందే’ అంటూ చెప్పుకొచ్చింది నందిని రెడ్డి.
ఇది విన్న అభిమానులు ఇక సమంత జీవితాంతం ఈ నరకం అనుభవించాల్సిందేనా, ఇంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఆమె గర్భం దాల్చి , ఒక బిడ్డకు జన్మని ఇవ్వాలనుకోవడం, కెరీర్ పరంగా ఫోకస్ పెట్టి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకోవడం సాధారణమైన విషయం కాదు. కచ్చితంగా సమంత ని ఈ విషయం లో మెచ్చుకొని తీరాల్సిందే. ఆమె పోరాటం ఎంతో మంది మహిళలకు ఆదర్శప్రాయం. కష్టాలు ఎదురైనప్పుడు ఎదురుకోవాలి , ఉన్నది ఒక్కటే జీవితం , పుడుతామా ఎటి మళ్లీ అనే ‘పెద్ది’ డైలాగ్ ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
