Samantha Ruth Prabhu : అనారోగ్యంతో బాధపడుతున్న సమంత ఆసుపత్రిలో కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా చేతికి సెలైన్ తో సమంత కనిపించడం చర్చకు దారి తీసింది. సమంత గత ఏడాది అక్టోబర్ నెలలో తనకు మయోసైటిస్ సోకినట్లు వెల్లడించారు. సమంత ప్రకటన టాలీవుడ్ వర్గాలను షాక్ కి గురి చేసింది. ఆమె త్వరగా కోలుకోవాలని చిత్ర ప్రముఖులు కోరుకున్నారు. యశోద చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా సమంత మీడియా ముందుకు వచ్చింది. ఆమెను సుమ ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో సమంత కీలక విషయాలు వెల్లడించారు. మయోసైటిస్ ప్రాణాంతకం కాదు. మీడియాలో రాసినట్లు నేను ఇప్పుడు చనిపోవడం లేదు. అలా అని ఇది చిన్న సమస్య కూడా కాదు. నేను పోరాడాల్సి ఉందని చెప్పింది. నెలల తరబడి సమంత ఇంటికే పరిమితమైంది. నివాసంలోనే సమంతకు చికిత్స జరిగినట్లు తెలిసింది. గత ఆరు నెలలుగా సమంత షూటింగ్స్ లో పాల్గొంది. ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ ని ఆమె పూర్తి చేసింది.
ఇటీవల సమంత అమెరికా వెళ్లారు. అక్కడ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్నారని వాదనలు వినిపించాయి. ప్రస్తుతం సమంత ఖాళీగా ఉంది. ఎలాంటి షూటింగ్స్ చేయడం లేదు. కాగా సమంత సడన్ గా పోస్ట్ పెట్టింది. సదరు పోస్ట్ లో ఆమె సెలైన్ పెట్టుకొని కనిపించింది. ఆ ఫోటో చూసి ఫాన్స్ కంగారు పడ్డారు. అయితే సమంత వివరణ చదివాకా ఊపిరి పీల్చుకున్నారు.
సమంత ఎనర్జీ, కండరాలు శక్తివంతం కావడానికి, గుండెకు రక్త సరఫరా మెరుగయ్యేందుకు, రోగనిరోధక శక్తి పెంచేందుకు, వైరస్ ల మీదే పోరాడే శక్తిని అందించేందు, ఇంకా కొన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం, ఆ సైలెన్ ఎక్కించుకుంటున్నారట. బహుశా మయోసైటిస్ కారణంగా ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్ నుండి రక్షణ కోసం సమంత ఇలా చేస్తున్నారని అర్థం అవుతుంది. మరి ఎంత కాలం సమంత పోరాడాల్సి ఉంటుందో. సమంత ఎలాంటి కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు. ఈ ఏడాది సమంత నటించిన శాకుంతలం నిరాశపరిచింది. ఖుషి మిశ్రమ స్పందన దక్కించుకుంది.