https://oktelugu.com/

Samantha Goa Trip: గోవాలో లగ్జరీ రిసార్ట్ లో ఆమెతో సమంత సంబరాలు !

Samantha Goa Trip: సమంత ప్రస్తుతం ఎంజాయ్ చేసే మూడ్ లో ఉంది. ఒంటరితనం నుండి బయట పడటానికి సమంత చేయని ప్రయత్నం లేదు. అయితే, ఆమెను ఒంటరి తనం నుంచి దూరం చేయడానికి అక్కినేని ఫ్యామిలీ స్నేహితురాలు శిల్పారెడ్డి కుటుంబం బాగానే ప్రయత్నం చేస్తోంది. శిల్పారెడ్డికి సమంతకి మధ్య మంచి అనుబంధం కుదిరింది. నిజానికి శిల్పారెడ్డి నాగార్జునతో సన్నిహితంగా ఉంటుంది. అయితే, సామ్ అక్కినేని కోడలుగా ఉన్న సమయంలో శిల్పారెడ్డికి – సామ్ కి మధ్య […]

Written By:
  • Shiva
  • , Updated On : December 29, 2021 / 10:48 AM IST
    Follow us on

    Samantha Goa Trip: సమంత ప్రస్తుతం ఎంజాయ్ చేసే మూడ్ లో ఉంది. ఒంటరితనం నుండి బయట పడటానికి సమంత చేయని ప్రయత్నం లేదు. అయితే, ఆమెను ఒంటరి తనం నుంచి దూరం చేయడానికి అక్కినేని ఫ్యామిలీ స్నేహితురాలు శిల్పారెడ్డి కుటుంబం బాగానే ప్రయత్నం చేస్తోంది. శిల్పారెడ్డికి సమంతకి మధ్య మంచి అనుబంధం కుదిరింది. నిజానికి శిల్పారెడ్డి నాగార్జునతో సన్నిహితంగా ఉంటుంది.

    Samantha Goa Trip

    అయితే, సామ్ అక్కినేని కోడలుగా ఉన్న సమయంలో శిల్పారెడ్డికి – సామ్ కి మధ్య మంచి స్నేహం బిల్డ్ అయింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రత్యేకంగా పార్టీలు చేసుకోవడం, అలాగే కలిసి వెకేషన్ కి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. తాజాగా గోవాలో ఒక లగ్జరీ రిసార్ట్ విల్లాను బుక్ చేసుకుని ప్రస్తుతం సమంత – శిల్పారెడ్డి అక్కడే కొత్త ఏడాది సంబరాలు చేసుకుంటున్నారు.

    పైగా ఆ వెకేషన్ ఎంజాయ్ మూమెంట్స్ ను ఫోటోలుగా తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. మొత్తమ్మీద 2022 కొత్త ఏడాదికి గోవాలోనే స్వాగతం పలుకబోతున్నారు సమంత – శిల్పారెడ్డి. సమంత, చైతూ విడిపోయాక, సామ్ చాలా మానసిక సంఘర్షణకు గురి అయింది. పైగా నిరాధారమైన కథనాలు, వార్తలు కూడా సామ్ ను బాగా ఇబ్బంది పెట్టాయి.

    Also Read: బికినీలో సమంత.. శృతిమించిన అందాల ఆరబోత !

    మరి ఒత్తిడిలో, బాధలో ఉన్నప్పుడు స్నేహితుల తోడు అవసరం. సమంత అదే పని చేస్తోంది. తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డి తో కలిసి వరుసగా ఇలా ప్రత్యేక టూర్స్ ను ప్లాన్ చేసుకుంటుంది. వీలైనంత ఎక్కువ సమయం ఆమెతో గడపడానికి ప్రయత్నం చేస్తోంది. శిల్పారెడ్డి కూడా సమంత పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెకు తోడుగా ఉంటూ.. ఆమె అవసరాలను తీరుస్తోంది.

    ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత డెబ్యూ ఐటెం నంబర్ ”ఊ అంటావా ఊఊ అంటావా” భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. అలాగే సామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’ షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొంది. అయితే, ఈ 2021 ఆమెకి జీవితంలో చేదు అనుభవాన్ని మిగిల్చింది.

    Also Read: సింహం బలం పులి తెగింపు కలిపితే లైగర్ !

    Tags