https://oktelugu.com/

Sai Dharam Tej : ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయిన సాయి ధరమ్ తేజ్.. కానీ చివరికి ఏమైందంటే!

Sai Dharam Tej :  మెగా మేనల్లుడిగా, టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకడిగా సాయి ధరమ్ తేజ్ కి మంచి పేరున్న సంగతి అందరికీ తెలిసిందే.కెరీర్ ప్రారంభం లో వరుసగా సూపర్ హిట్స్ దక్కించుకున్న ఈయన, ఆ తర్వాత వరుసగా ఆరు డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకొని రేస్ లో వెనకపడ్డాడు.మళ్ళీ చిత్రలహరి చిత్రం నుండి స్క్రిప్ట్ సెలెక్షన్స్ విషయం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. విజయాలు వరిస్తున్నాయి, ఆయన […]

Written By:
  • NARESH
  • , Updated On : April 19, 2023 / 10:14 PM IST
    Follow us on

    Sai Dharam Tej :  మెగా మేనల్లుడిగా, టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకడిగా సాయి ధరమ్ తేజ్ కి మంచి పేరున్న సంగతి అందరికీ తెలిసిందే.కెరీర్ ప్రారంభం లో వరుసగా సూపర్ హిట్స్ దక్కించుకున్న ఈయన, ఆ తర్వాత వరుసగా ఆరు డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకొని రేస్ లో వెనకపడ్డాడు.మళ్ళీ చిత్రలహరి చిత్రం నుండి స్క్రిప్ట్ సెలెక్షన్స్ విషయం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.

    విజయాలు వరిస్తున్నాయి, ఆయన గత చిత్రం రిపబ్లిక్ కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ, నటుడిగా ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకున్నందుకు గాను సాయి ధరమ్ తేజ్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.ఈ సినిమా విడుదల సమయం లోనే ఆయనకీ బైక్ యాక్సిడెంట్ అయ్యింది.అభిమానుల దీవెనలతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు లేటెస్ట్ గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం ఈ నెల 21 వ తారీఖున విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నది.

    ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ లో క్షణకాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు సాయి ధరమ్ తేజ్, వరుసపెట్టి ఇంటర్వ్యూస్ సినిమాకి సంబంధించిన విశేషాలే కాకుండా, తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను కూడా షేర్ చేసుకున్నాడు.రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుండి నాకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం, ఎన్నో మెడల్స్ కూడా సాధించాను.అంతే కాదు,నేషనల్ క్రికెట్ టీం లో కూడా నేను సెలెక్ట్ అయ్యాను కానీ సినిమాల మీద ఉన్న మక్కువ కారణం గా వెళ్ళలేకపోయాను’ అంటూ సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ చేసాడు.కొంతమంది ఇతనిలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోతుంటే, మరికొంత మంది సొల్లు ఆపు అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.