https://oktelugu.com/

RRR Movie Success Meet: రాజమౌళి అగ్రిమెంట్ ను బ్రేక్ చేసిన అమీర్ ఖాన్

RRR Movie Success Meet: పెద్దలను గౌరవించడం మనం సంప్రదాయం అని ఎప్పటినుంచో చెబుతున్నారు. అప్పుడెప్పుడో మనం సినిమాలు చూస్తున్నప్పటి నుంచి జనాలను అలరిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ను ఇండస్ట్రీలోని అందరూ ‘సర్’ అని పిలుస్తారు. కానీ దేశం గర్వించే అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీస్తున్న రాజమౌళి కూడా అలానే పిలిచారు. అమీర్ ఖాన్ అనుభవంతో పోలిస్తే రాజమౌళిదే తక్కువే. కానీ ఈయన ఇచ్చిన హిట్స్ దృష్టిలో పెట్టుకొని రాజమౌళిని తనను పేరు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 7, 2022 / 05:11 PM IST
    Follow us on

    RRR Movie Success Meet: పెద్దలను గౌరవించడం మనం సంప్రదాయం అని ఎప్పటినుంచో చెబుతున్నారు. అప్పుడెప్పుడో మనం సినిమాలు చూస్తున్నప్పటి నుంచి జనాలను అలరిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ను ఇండస్ట్రీలోని అందరూ ‘సర్’ అని పిలుస్తారు. కానీ దేశం గర్వించే అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీస్తున్న రాజమౌళి కూడా అలానే పిలిచారు. అమీర్ ఖాన్ అనుభవంతో పోలిస్తే రాజమౌళిదే తక్కువే. కానీ ఈయన ఇచ్చిన హిట్స్ దృష్టిలో పెట్టుకొని రాజమౌళిని తనను పేరు పెట్టి పిలవాలని అమీర్ ఖాన్ కండీషన్ పెట్టాడట.. ‘అమీర్ ఖాన్ సర్’ అనవద్దని రాజమౌళికి స్వయంగా సూచించాడట.. కానీ దీనికి ఎంతో ఇబ్బంది పడ్డ రాజమౌళి తాజాగా ఆ సీక్రెట్ గురించి బయటపెట్టాడు.

    అమీర్ ఖాన్.. మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అని బాలీవుడ్ లో పేరుంది. ఒకప్పుడు సంచలన సినిమాలు తీసి వరుస హిట్స్ కొట్టిన అమీర్ ఖాన్ కు ఈ మధ్య హిట్స్ కరువయ్యాయి. ఆయన తీసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే సినిమాలేవీ చేయకుండా ఖాళీగానే ఉన్నారు. ఈ మధ్య తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఇగోలకు పోకుండా ప్రమోషన్ లో కూడా పాల్గొన్నారు.

    ఈ క్రమంలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన అమీర్ ఖాన్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు రాజమౌళి. ముంబైలో ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ మీట్ సందర్భంగా వీరిద్దరి మధ్య సాగిన ఓ సంభాషణను రాజమౌళి వివరించారు. అదిప్పుడు వైరల్ గా మారింది.

    ఆర్ఆర్ఆర్ సక్సెస్ మీట్ లో మొదట అమీర్ ఖాన్ మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్ విడుదలై ఇంతటి ఘనవిజయం సాధించడంతో రాజమౌళి, అండ్ టీం మొత్తం ఆనందంగా ఉందని.. రాజమౌళి ఇలాగే అద్భుతమైన విజయాలు అందుకోవాలని.. మంచి సినిమాలతో మమ్మల్ని ఎప్పుడూ ఎంటర్ టైన్ చేయాలని కోరుకుంటున్నానని’ అమీర్ ఖాన్ తెలిపారు.

    ఈ క్రమంలోనే రాజమౌళి మైక్ అందుకొని అభ్యంతరం తెలిపారు. ‘అమీర్ ఖాన్ , నాకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. కేవలం పేర్లు పెట్టి మాత్రమే పిలుచుకోవాలని.. సర్, గారు అనే పదాలు ఉపయోగించుకోకూడదని ఇటీవల మా మధ్య అగ్రిమెంట్ చేసుకున్నాం.. కానీ ఆయన్ని ‘సర్’ అని కాకుండా ‘ఏకే’ అని పిలవడానికి కాస్త ఇబ్బందిపడ్డాను. అమీర్ ఒత్తిడి చేయడంతో ‘ఏకే’ అని పిలవగలిగాను. కానీ ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ను అమీర్ ఖాన్ బ్రేక్ చేసి నన్ను ‘రాజాజీ’ అని పిలుస్తున్నారు’ అని రాజమౌళి అన్నారు.