RRR: ఆర్ఆర్ఆర్ ప్రారంభించిన ముహూర్తమే సరిగాలేదు. ఆరంభం నుండి అన్నీ అవరోధాలే. రామ్ చరణ్ గాయంతో మొదలైన అవరోధాల పరంపర కొనసాగుతూనే ఉంది. కెరీర్ లో రాజమౌళిని ఆర్ఆర్ఆర్ టెన్షన్ పెట్టినంతగా మరో చిత్రం పెట్టలేదు. రాజమౌళి సినిమాలు సమయానికి పూర్తి కావు,చెప్పిన టైంకి విడుదలకు నోచుకోవు. ఆర్ఆర్ఆర్ మరింతగా ఇబ్బందులపాలు చేసింది. ఇప్పటికే మూడు సార్లు విడుదల వాయిదా పడింది.
ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో రామ్ చరణ్ అనంతరం ఎన్టీఆర్ గాయాలపాలయ్యాడు. దాని వలన కొన్ని రోజులు షూటింగ్ జరగలేదు. ఇక కరోనా వైరస్ రాకతో మరిన్ని ఇబ్బందులు మొదలయ్యాయి. దేశదేశాలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు ఆర్ఆర్ఆర్ కోసం పనిచేస్తుండగా.. కోవిడ్ ఆంక్షల మధ్య వారందరినీ ఓ చోటకు చేర్చడం తలనొప్పిగా మారింది. ఒకరకంగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. తాను అనుకున్నది అనుకున్నట్లు చేయడానికి పరిస్థితులు సహకరించలేదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి కారణంగా… సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉన్న వనరులతో బెస్ట్ అవుట్ ఫుట్ కోసం ట్రై చేశారు.
ఇన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని 2022 జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సన్నాహాలు చేస్తుంటే.. మరి కొన్ని సవాళ్లు ఎదురుచూస్తున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి. ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభిస్తుంది. దీంతో పాక్షికంగా అనేక రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. తెలుగు తర్వాత రాజమౌళి సినిమాలకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న నార్త్ ఇండియా పరిస్థితి బాగోలేదు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ‘పే పర్ వ్యూ’లో.. వర్కౌట్ అవుతుందా ?
ఢిల్లీలో పూర్తిగా సినిమా థియేటర్స్ మూసివేశారు. మహారాష్ట్రలో నైట్ క్యూర్ఫ్ విధించడంతో పాటు కేవలం 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉంది. ఇది ఆర్ ఆర్ ఆర్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో హిందీ చిత్రాల విడుదల వాయిదా వేస్తున్నారు. షాహిద్ కపూర్ జెర్సీ మూవీ డిసెంబర్ 31న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా వేశారు. ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా వేయనున్నారంటూ పుకార్లు చెలరేగుతున్నాయి.
అయితే ఆర్ ఆర్ ఆర్ వాయిదా వేయడానికి అవకాశం లేదు. ప్రమోషన్స్ కోసం భారీగా టీమ్ ఖర్చుపెట్టారు. ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ విరివిగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. విడుదల వాయిదా వేస్తే ఇప్పటిదాకా పెట్టిన ప్రమోషన్స్ ఖర్చు వేస్ట్ అవుతుంది. అలా అని విడుదల చేస్తే ఆశించిన వసూళ్లు రావు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ టీమ్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న తీరుగా తయారైంది.
Also Read: మల్టీస్టారర్ కింగ్ మేకర్స్ ఆప్పుడు బాలచందర్.. ఇప్పుడు రాజమౌళి- జూ.ఎన్టీఆర్