RRR: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మల్టీస్టార్ భారీ చిత్రం ‘రణం రౌద్రం రుధిరం’(ఆర్ఆర్ఆర్). రెండేళ్ల కిందట ప్రారంభమైన ఈ మూవీ చిత్రీకరణకు ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినా వాటిని అధిగమించుకొని చిత్ర బృందం మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నా మూవీ యూనిట్ ఈ సినిమాను జనవరి 7న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే మరోసారి దేశంలో ఒమిక్రాన్ భయం పుట్టుకొస్తోంది. ఒకవేళ కేసులు పెరిగితే మాత్రం మళ్లీ థియేటర్లపై ప్రభావం పడే అవకాశం ఉందా..? అన్న ఆందోళన మొదలైంది. ఒకవేళ ఒమిక్రాన్ విజృంభిస్తే ఆర్ఆర్ఆర్ ను ఓటీటీలో రిలీజ్ చేస్తారా..? అనే వాదనలు పుట్టుకొస్తున్నాయి. అయితే చిత్రం బృందం థియేటర్లలో రిలీజ్ చేస్తామని సోమవారం రాత్రి ప్రకటించారు.
అనుమానాలు, భయాల మధ్య మొత్తానికి ఆర్ఆర్ఆర్ ను జనవరి 7న విడుదల చేయడానికి నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా 6వేల థియేటర్లలో సినిమా ప్రదర్శన మొదలు కానుంది. ఇందుకోసం దాదాపు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా విడుదల కాని రీతితో ఆర్ఆర్ఆర్ ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత డివివి దానయ్య తెలిపారు. మొదటిరోజే 100 శాతం కలెక్షన్లు వచ్చేలా ప్లాన్ వేశారు. అయితే కొన్ని చోట్ల సినిమా రిలీజ్ కు ఆటంకాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా మనదేశంలోని ఉత్తర ప్రాంతంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున అక్కడ సినిమా విడుదల ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇంకా 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిరోజు ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: RRR: మల్టీస్టారర్ కింగ్ మేకర్స్ ఆప్పుడు బాలచందర్.. ఇప్పుడు రాజమౌళి- జూ.ఎన్టీఆర్
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ తరుణంలో చిత్రబృందం ప్లాన్ సక్సెస్ అవుతుందా..? అనే ఆతృతతో ఉన్నారు. అయితే ఈ సమయంలో చిత్ర నిర్మాత ఓటీటీ దారి పట్టనున్నట్లు తెలుస్తోంది. మొదటిరోజు అనుకున్న కలెక్షన్లు రాకపోతే ఓటీటీ ద్వారా పే పర్ వ్యూ ద్వారా రిలీజ్ చేయనున్నారు. అయితే దీనిపై పూర్తి నిర్ణయం తీసుకోలేదు. అయితే అలా చేయడం వల్ల థియేటర్లోకి రాని వారు ఈ సినిమాను చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా సాధారణ ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తే సాధారణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోనూ థియేటర్ల బాట పట్టే అవకాశం లేదని అంటున్నారు.
కరోనా పరిస్థితులు ఎలా ఉన్నా థియేటర్లోనే రిలీజ్ చేస్తామని నిర్మాత ప్రకటించారు. అలా కానీ ప్రమాదంలో సినిమాకు చాలా మైనస్ ఏర్పడే ప్రమాదం ఉంది. థియేటర్లో కాకుండా ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తే ఈజీగా పైరసీ అయ్యే అవకాశం ఉంది. దీంతో సినిమా మొత్తం ముందురోజే మొబైల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల థియేటర్లోనే రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రూ.470 కోట్లతో నిర్మించిన ఈ మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్ ఉన్నాయి. వంద శాతం కలెక్షన్లు మొదటిరోజే రాబట్టుకొని ఆ తరువాత లాభాల కోసం ఎదురుచూడాలని అనుకుంటున్నారు. కానీ ఒమిక్రాన్ ఏం చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమాకోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచడంతో సినిమాకు ఇబ్బంది లేదు. కానీ ఏపీలో మాత్రం రేట్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అధిక ఆదాయం వచ్చే ఏపీలో పరిస్థితి ఇలాగే ఉంటే సినిమాపై కాస్త ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే నిర్మాతలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి థియేటర్ల యాజమాన్యాలకు, డిస్ట్రిబ్యూటర్లకు అపాయింట్మెంట్ ఇచ్చారు. రేట్లపెంపు విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఆర్ఆర్ఆర్ ప్లాన్ సక్సెస్ కానుంది.
Also Read: RRR: నా చివరి శ్వాస వరకు తారక్ స్నేహం నా గుండెల్లో నిలిచిపోతుంది- చరణ్