
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో బీజీగా ఉన్నాడు. ఈ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించనున్నాడు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, సీనియర్ నటి శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రాంచరణ్ కు జోడీగా అలియాభట్ నటిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాంచరణ్ తదుపరి ఎలాంటి మూవీ చేయనున్నాడనే ఆసక్తి నెలకొంది. తాజాగా జెర్సీ మూవీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చరణ్ కు కలిసి ఓ లవ్ స్టోరీని విన్పించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
రామ్ చరణ్ ఇప్పటివరకు చేసిన ఏకైక లవ్ స్టోరీ ‘ఆరెంజ్’. ఈ చిత్రం అనుకున్నంత విజయం దక్కకపోయినా చరణ్ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ‘ఆరెంజ్’ తన మనస్సు నచ్చిన మూవీ అని రాంచరణ్ చాలాస్లారు చెప్పాడు. ఈ మూవీ తర్వాత లవ్ స్టోరీలను పక్కనపెట్టి కమర్షియల్ మూవీలను చేస్తూ పోయాడు. తాజాగా దర్శకుడు గౌతమ్ ఓ ప్యూర్ లవ్ స్టోరీని చరణ్ కు వినిపించగా వెంటనే ఓకే చేశాడట. ఉత్తరాది అమ్మాయి.. దక్షిణాది అబ్బాయి మధ్య లవ్ స్టోరీ అద్భుతంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ లవ్ స్టోరీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.
‘మళ్లీ రావా..’ ‘జెర్సీ’ చిత్రాలతో దర్శకుడు గౌతమ్ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గౌతమ్ సినిమాల్లో ఓ ఎమోషన్ క్యారీ అవుతుంటుంది. తాజాగా చెర్రీకి వినిపించిన ప్రేమకథలోనూ ఓ ఎమోషన్ కామన్ గా ఉంటుందట. ఇప్పటికే ప్రదీప్ అనే కొత్త కుర్రాడు రాంచరణ్ ఓ కథను విన్పించి లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా గౌతమ్ కథకు ఓకే చేసనట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరిలో రాంచరణ్ ముందుగా ఏ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.