Homeఎంటర్టైన్మెంట్Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ - సుకుమార్ మూవీ షూటింగ్ ప్రారంభం తేదీ...

Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ – సుకుమార్ మూవీ షూటింగ్ ప్రారంభం తేదీ ఫిక్స్.. ఫ్యాన్స్ కి ఇక పండగే..

Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ , ఇండస్ట్రీ హిట్స్ ఉండొచ్చు. రాబోయే రోజుల్లో కూడా పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమాలు రావొచ్చు. కానీ ఆయన కెరీర్ లో అభిమానులకు ‘రంగస్థలం’ లాంటి థియేట్రికల్ అనుభూతిని అందించడం చాలా కష్టం. కేవలం సుకుమార్ మాత్రమే ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయగలడు. అందుకే చరణ్ అభిమానులు సుకుమార్ తో సినిమా కోసం ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘పుష్ప’ మూవీ రన్నింగ్ లో ఉన్న సమయం లోనే వీళ్లిద్దరి కాంబినేషన్ మరో సినిమా రాబోతుందని అధికారిక ప్రకటన చేశారు. కానీ అంతకంటే ముందు ‘గేమ్ చేంజర్ ‘, ‘పెద్ది’ చిత్రాలను పూర్తి చేయాల్సి వచ్చింది. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘గేమ్ చేంజర్ ‘ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిలబడగా , ‘పెద్ది’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

‘పెద్ది’ ఇచ్చిన సక్సెస్ ఊపు నుండి రామ్ చరణ్ ఇంకా బయటకు రాలేదు. నేడు కూడా హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో నేడు ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ సభ జరగబోతుంది. ఈ సభకు మెగాస్టార్ చిరంజీవి , సుకుమార్ లు కూడా హాజరు కాబోతున్నారు. సుకుమార్ తన ప్రసంగం లో రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ చెప్తాడా లేదా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అందుతున్న విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే , ఈ సినిమాని ఈ ఏడాది దసరా కానుకగా మొదలు పెట్టే ఆలోచన లో ఉన్నట్టు తెలుస్తోంది. గతం లో రామ్ చరణ్ తో ‘రంగ స్థలం’ లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేసిన సుకుమార్, ఈసారి మాత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ముందుగా రెండు మూడు స్టోరీ లైన్స్ అనుకున్నారని , కానీ చివరికి యాక్షన్ ఎంటర్టైనర్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతున్నారట. నేడు ‘పెద్ది’ విజయోత్సవ సభలో ఈ ప్రకటన చేస్తే చాలా బాగుంటుందని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరి సుకుమార్ చెప్తాడో లేదో చూడాలి. ఒకవేళ చెప్తే మాత్రం సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ క్రేజ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల చెయ్యాలని ప్లాన్ , మరి సుకుమార్ అంత తొందరగా ఈ సినిమాని పూర్తి చేస్తాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version