Ram Charan NTR RRR Movie: ఆర్ఆర్ఆర్ మేనియా మొదలైంది. అమెరికాలో ప్రీమియర్స్ ఒకరోజు ముందే పడబోతున్నాయి. దీంతో ఆ ఎక్సట్ మెంట్ అందరిలోనూ నెలకొంది. అందరికంటే ముందే ట్విట్టర్ లో ఆర్ఆర్ఆర్ టాక్ బయటకు రానుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు అగ్రహీరోలు.. పైగా టాలీవుడ్ ను ఏలుతున్న రెండు అగ్ర ఫ్యామిలీల హీరోలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఈ మూవీపై ఆయా అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఏమాత్రం ఎవ్వరు ఎక్కువైనా.. ఇంకొకరు తక్కువైనా థియేటర్లలో రచ్చ రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వెబ్ సైట్లు, మీడియాల్లో ఎన్టీఆర్ పాత్ర గురించి గొప్పగా ప్రచారం చేస్తుండడంతో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రాంచరణ్ పాత్ర తక్కువైతే ఊరుకోం అంటూ హెచ్చరికలు జారీ చేసింది.
దీంతో అసలు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో ఇద్దరు హీరోలకు సమ ప్రాధాన్యం ఇచ్చారా? లేక ఎన్టీఆర్ ను లేపి.. రాంచరణ్ ను తగ్గించాడా? అన్న ఆందోళనలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ లు, టాక్ ను బట్టి చూస్తే.. బ్రిటీష్ తరుఫున పోలీస్ గా ఉండి ముందు వారికి సహకరించి అనంతరం మారి కొమురం భీం(ఎన్టీఆర్)తో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ కనిపించనున్నట్టు తెలిసింది.
Also Read: సర్కారువారి పాటను వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్.. మహేష్ బ్రేక్ చేస్తాడా..?
అంటే ముందు రాంచరణ్ బ్రిటీష్ వారి తరుఫున పనిచేస్తారని.. సొంత ప్రజలపైనే అజమాయిషీ చేస్తాడన్న ప్రచారం సాగుతోంది. ఇది తొలుత నెగెటివ్ రోల్ అన్న గాసిప్ నడుస్తోంది. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ ఊరుకోవడం కష్టమే. థియేటర్లు పగిలిపోవడం.. రచ్చ కావడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నాయన్న వార్తలపై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. రాంచరణ్ గురించి సినిమాలో చూపించలేదో థియేటర్లు బద్దలు కొడుతాం అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో ఒకింత టెన్షన్ వాతావరణమే నెలకొంది.
ఇక కొమురంభీంగా ఎన్టీఆర్ పాత్ర తొలి నుంచి బ్రిటీష్/నైజాం వారికి వ్యతిరేకంగానే సాగుతుందని అంటున్నారు. అతడు స్వాతంత్ర్య వీరుడిగానే రాజమౌళి చూపించాడని.. పులితో ఫైట్.. బ్రిటీషర్లతో పోరాటంలో బెబ్బులిలా కొట్లాడేలా డిజైన్ చేసినట్టు సమాచారం.
ఆర్ఆర్ఆర్ లో ఇద్దరి పాత్రలకు సమప్రాధాన్యం ఉంటే మెగా, నందమూరి ఫ్యాన్స్ ఇద్దరూ కలిసిపోతారు. ఏమాత్రం తేడా కొట్టినా ఇద్దరూ విడిపోయి రచ్చ రచ్చ చేయడం గ్యారెంటీ. ఇప్పటికే ఇంత పెద్ద స్టార్లను తీసుకొని రాజమౌళి జాగ్రత్తగానే సినిమా తీశానని చెప్పుకొచ్చాడు. ఇద్దరికి సమ ప్రాధాన్యం ఉంటుందని వివరించాడు. మరి స్క్రీన్ పై రాజమౌళి ఎలా చూపించాడు? దాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారాన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి నోట మాట రాని డిస్ట్రిబ్యూటర్స్?
Recommended Video: