Homeఎంటర్టైన్మెంట్Ram Charan: రామ్ చరణ్ కూతురు క్లిన్ కారాకు ఊపిరి ఆడలేదు! హాస్పిటల్ వద్ద ఫ్యాన్స్...

Ram Charan: రామ్ చరణ్ కూతురు క్లిన్ కారాకు ఊపిరి ఆడలేదు! హాస్పిటల్ వద్ద ఫ్యాన్స్ అత్యుత్సాహం..వీడియో వైరల్!

Ram Charan: రామ్ చరణ్(Global Star Ram Charan), ఉపాసన(Upasana Konidela) దంపతులు నిన్న రాత్రి ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ వార్తనే కనిపిస్తుంది. రామ్ చరణ్ అభిమానుల సంబరాలకు హద్దులే లేకుండా పోయింది. ఏ రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారంటే నిన్న అర్థరాత్రి హాస్పిటల్ బయట క్రాకర్స్ కాల్చేంత రేంజ్ లో చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది ఇలా చేయడం పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, హాస్పిటల్ బయట ఎవరైనా ఇలా క్రాకర్స్ కాలుస్తారా?, చాలా తప్పు ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఎమోషన్ తో ఉన్న సమయంలో బుర్ర పని చెయ్యదు, మనసుకి ఆ క్షణం లో ఏది తోచితే అది చేస్తారు, బహుశా అభిమానుల పరిస్థితి కూడా ఆ సమయంలో అలాగే ఉండుండొచ్చు అంటూ చెప్పుకొస్తున్నారు.

ఇకపోతే నేడు కాసేపటి క్రితమే రామ్ చరణ్ తన పెద్ద కూతురు క్లిన్ కారా తో కలిసి అపోలో హాస్పిటల్ లోకి అడుగుపెట్టాడు. ఆ సమయం లో అభిమానులు అతన్ని చుట్ట ముట్టడంతో , వాళ్ళ మధ్యలో నుండి వెళ్లే విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ విజువల్స్ ని చూసి నెటిజెన్స్ భయపడిపోతున్నారు. చిన్న బిడ్డ క్లిన్ కారా ఆ జనాలను చూసి భయపడిపోయింది. కాసేపు ఆ చిన్నారి కి ఊపిరి ఆడలేదు. చిన్న బిడ్డ తో ఉన్నాడు, అభిమానులు అలా చుట్టముట్టడం అవసరమా?, అసలు అభిమానులకు బుర్ర ఉందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయినా పోలీసులు ఏమి చేస్తున్నారు, రామ్ చరణ్ వస్తున్న సమయం లో అక్కడ అభిమానులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కదా, చిన్న బిడ్డకి ఏమైనా జరిగితే ఎవరు జవాబు చెప్తారు? అంటూ నిలదీస్తున్నారు.

సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన ఈ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి. ఇకపోతే కాసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అభిమానులతో ఈ శుభవార్తని పంచుకున్నాడు. ఆయన తో పాటు ఉపాసన కి ఆపరేషన్ చేసిన గైనకాలజిస్ట్ కూడా ఈ మీడియా సమావేశం లో పాల్గొని మాట్లాడాడు. వీళ్ళు మాట్లాడుతున్నంతసేపు అభిమానులు ‘జై చిరంజీవ’, ‘జై చరణ్’ నినాదాలతో హోరెత్తించారు. చిరంజీవి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయాడు. ఆ రేంజ్ ఉత్సాహం లో ఉన్నారు మెగా ఫ్యాన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version