https://oktelugu.com/

SS Rajamouli: ఆ రోజును రాజమౌళి ఎప్పటికీ మర్చిపోలేడట !

SS Rajamouli: తమిళ నాట అజిత్‌ ని హీరోగా కంటే ఒక లీడర్ గానే ఎక్కువమంది భావిస్తారు. అజిత్ లాంటి హీరోకి అతి సాధారణంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అజిత్ ఉంటాడు. అలాగే అజిత్, తోటి మనుషులతో ప్రవర్తించే తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ విషయాన్ని రాజమౌళి తమిళ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం ఆ క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి […]

Written By:
  • Shiva
  • , Updated On : January 1, 2022 11:20 am
    Follow us on

    SS Rajamouli: తమిళ నాట అజిత్‌ ని హీరోగా కంటే ఒక లీడర్ గానే ఎక్కువమంది భావిస్తారు. అజిత్ లాంటి హీరోకి అతి సాధారణంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అజిత్ ఉంటాడు. అలాగే అజిత్, తోటి మనుషులతో ప్రవర్తించే తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ విషయాన్ని రాజమౌళి తమిళ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం ఆ క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

    SS Rajamouli

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి అజిత్ గురించి మాట్లాడుతూ.. ‘కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ అజిత్‌ చాలా సాదాసీదాగా ఉంటాడని జక్కన్న చెప్పుకొచ్చాడు. అలాగే అజిత్ చాలా డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌ అని కూడా తెలియజేస్తూ అజిత్ తో తనకు జరిగిన ఓ సంఘటనను చాలా క్లారిటీగా వివరించాడు.

    రాజమౌళి కుటుంబం సితార హోటల్‌ కి వెళ్ళింది. రాజమౌళి అలా ఫోన్ లో మాట్లాడుకుంటూ అందరి కంటే ముందుగా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు. అక్కడ హీరో అజిత్‌ ఓ టేబుల్ పై కూర్చుని ఉన్నాడు. అజిత్ భోజనం చేస్తున్నారు. దాంతో రాజమౌళి ఆయన వద్దకు వెళ్లకుండా వేరే టేబుల్‌ దగ్గర కూర్చుని
    తన భార్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఇన్ స్పైర్ అతనే.. కథ అక్కడే మొదలైంది..: రాజమౌళి

    అయితే, ఆ సమయంలో రాజమౌళిని చూసిన అజిత్‌ నేరుగా ఆయన వద్దకు వచ్చి.. ‘‘సర్‌. ఎలా ఉన్నారు?’’ అని నవ్వుతూ పలకరించారు. పైగా రాజమౌళిని కూడా తన టేబుల్‌ వద్దకు తీసుకువెళ్లారట అజిత్. ఆ సమయంలో వారిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. అంతలో అక్కడికి వచ్చారు రమా రాజమౌళి. ఆమె రాజమౌళి కోసం రెస్టారెంట్‌ లో చూస్తూ ఉన్నారు.

    అయితే సడెన్ గా అజిత్‌ ఆమె వద్దకు వెళ్లి.. తాను నటుడు అజిత్ అంటూ పరిచయం చేసుకుని, టేబుల్‌ దగ్గర ఉన్న రాజమౌళి వద్దకు తీసుకువచ్చాడట. కోట్లాది మంది అభిమానులు ఉన్న ఒక పెద్ద స్టార్, అలా అతి సాధారణ వ్యక్తిలా బిహేవ్ చేయడం తనను ఎంతో ఆశ్చర్యపరిచింది అని, ఆ రోజును తాను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు.

    Also Read: ఆర్ఆర్ఆర్ పై ఢిల్లీ ఎఫెక్ట్.. అయినా రిలీజ్ ఖాయం.. కారణం అదే!

    Tags