Vijayendra Prasad: దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా అదో పెను సంచలనంగా మారుతుంది. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దీంతో పాటుగా ఆయన తన తదుపరి సినిమా విషయంలో కూడా చాలా కీలకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…
అయితే మహాభారతంలో చాలా గొప్ప క్యారెక్టర్లు ఉంటాయి. కాబట్టి వాళ్లందర్నీ పోట్రే చేయడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటులు సరిపోరు. ఇతర భాషల హీరోలను కూడా తీసుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు టాప్ లో ఉన్నారు. అయితే వీళ్ళ నలుగురి కోసం క్యారెక్టర్ లను డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది…
మరి ఈ నలుగురు ఏ పాత్రలో కనిపించబోతున్నారు. మహాభారతంలో వీళ్ళు కనిపించే ఆ నాలుగు పాత్రలేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజమౌళి వాళ్ళ తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ దీని మీద చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే ఈ నలుగురు హీరోల్లో మహేష్ బాబు కృష్ణుడిగా, ప్రభాస్ కర్ణుడిగా, రామ్ చరణ్ అర్జునుడిగా, ఎన్టీఆర్ దుర్యోధనుడి పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలీదు గానీ మొత్తానికైతే ఈ క్యారెక్టర్లలో మన హీరోలు కనిపిస్తే మాత్రం వాళ్ళ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. ప్రతి ఒక్కరు వారి పాత్రల్లో జీవించడానికి చాలావరకు వాళ్లకు ఆస్కారమైతే దక్కుతుంది…చూడాలి మరి నిజంగానే మన స్టార్ హీరోలు ఈ పాత్రల్లో కనిపించి మెప్పిస్తారా లేదా అనేది…
