Raja Saab Collection: బాహుబలి తర్వాత మన టాలీవుడ్ కి ఓవర్సీస్ మార్కెట్ లాగా తోడైంది బాలీవుడ్ మార్కెట్. ఇక్కడ హీరో ఎవరు అనేది చూడరు, కంటెంట్ బాగుంటే హీరో ఎవరైనా చూస్తారు, ఒకవేళ బాగాలేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని అయినా ఫ్లాప్ చేస్తారు, కనీసం ఓపెనింగ్ వసూళ్ళు కూడా ఇవ్వరు. ఎన్నో ఏళ్ళ నుండి బాలీవుడ్ ని శాసిస్తున్న ఖాన్స్ ని దాటుకొని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు ‘పుష్ప 2’ తో మొదటి రోజు నుండి ఫుల్ రన్ వరకు ఆల్ టైం రికార్డ్స్ ని నమోదు చేసాడు. బాలీవుడ్ సరైన కంటెంట్ తో వెళ్తే ఎవరికైనా ఇలాగే ఉంటుంది. కానీ మన ఇండస్ట్రీ లో కొందరు కేవలం కొంతమందికి మాత్రమే బాలీవుడ్ లో మార్కెట్ ఉంది, అందులో ప్రభాస్ కూడా ఒకరు అని అనేవారు.
బాహుబలి సిరీస్, సాహూ, కల్కి, సలార్ చిత్రాలు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యాయి. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆదిపురుష్ చిత్రానికి కూడా అక్కడ భారీ వసూళ్లు వచ్చాయి. కచ్చితంగా ప్రభాస్ కి మంచి మార్కెట్ ఉంటుంది అనుకోవడం లో ఎలాంటి తప్పు లేదు. అయితే రీసెంట్ గా విడుదల చేసిన ‘రాజా సాబ్’ చిత్రం బాలీవుడ్ మార్కెట్ లో కనీస స్థాయి ఓపెనింగ్స్ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది. 5 కోట్ల నెట్ ఓపెనింగ్ వసూళ్లతో మొదలైన ఈ సినిమా, కేవలం 20 కోట్ల నెట్ క్లోజింగ్ తో థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. బాలీవుడ్ లో అన్ని బ్లాక్ బస్టర్స్ కొట్టినా కూడా ప్రభాస్ ఒక్క సరైన సినిమా ఇవ్వకపోతే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కాబట్టి బాలీవుడ్ మార్కెట్ ఒకరి అడ్డా అని ఎప్పటికీ చెప్పలేము అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
‘రాజా సాబ్’ విషయానికి వస్తే ఈ చిత్రానికి రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ కంటే తక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి హిందీ వెర్షన్ నుండి దాదాపుగా 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ‘రాజా సాబ్’ చిత్రానికి అందులో సగం, అంటే కేవలం 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. దీనిని ఆధారంగా చేసుకొని రామ్ చరణ్ కి ప్రభాస్ కంటే బాలీవుడ్ లో ఎక్కువ మార్కెట్ ఉందని చెప్పలేము, ఎందుకంటే ‘గేమ్ చేంజర్’ కి డైరెక్టర్ శంకర్, ఆయనకు దశాబ్దాల క్రితం నుండే అక్కడ మార్కెట్ ఉంది, కాబట్టి గేమ్ చేంజర్ కి ఆయన ఫేమ్ కూడా తోడైంది, అందుకే ఆ చిత్రానికి అంత కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు.
