Raja Ravindra comments On Prakash Raj: ఇండియా లోనే మంచి డిమాండ్ ఉన్న నటులలో ఒకరు ప్రకాష్ రాజ్(Prakash Raj). నటుడిగా ఆయన్ని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎదుటి వ్యక్తులపై విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తారు కానీ, అది కేవలం రాజకీయం వరకే పరిమితం చేసిన సందర్ద్భాలు ఉన్నాయి. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ తో రాజకీయ పరంగా కొట్లాడుతాడు, మళ్లీ అదే పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ రాజ్ రాజకీయ పరంగా తనపై ఎన్ని విమర్శలు చేసినా, నటుడిగా ఆయన ఒక శిఖరం అంటూ ఓజీ మూవీ ఫంక్షన్ లో కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఉంది. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ ని చాలా మంది తప్పుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన గురించి, ఆయన చేసిన సహాయాలు గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ప్రముఖ నటుడు రాజా రవీంద్ర రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘నా పెద్ద కుమార్తె పెళ్లి సమయం లో నేను తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాను. ఈ విషయం ప్రకాష్ రాజ్ కి ఎవరి ద్వారానో తెలిసింది. వెంటనే ఫోన్ చేసి నన్ను ఆయన ఇంటికి పిలిచి 50 లక్షల రూపాయిలు ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన ఒక్క రూపాయిల కూడా వెనక్కి అడగలేదు. కేవలం నాకు మాత్రమే కాదు, వేరే భాషకు చెందిన నటుడు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు, ప్రకాష్ రాజ్ కి ఈ విషయం తెలిసి, అతనికి 50 లక్షల రూపాయిలు ఇచ్చి ఆదుకున్నారు. ప్రకాష్ రాజ్ గారు డబ్బుకు తక్కువ విలువ ఇచ్చి, మనిషికి ఎక్కివ ప్రాధాన్యత ఇచ్చే మనిషి. అలాంటి వ్యక్తిని నా జీవితం లో ఎప్పుడూ చూడలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ప్రకాష్ రాజ్ కి సామజిక సేవ చేయాలనే తపన, పర్యావరణం పై మక్కువ ఉన్న వ్యక్తి. బెంగళూరు సమీపం లో ప్రకాష్ రాజ్ కి 10 ఎకరాల ఆర్గానిక్ ఫామ్ ఉంది, అక్కడ పశుపోషణ చేస్తూ ప్రకృతి తో మమేకం అవుతూ ఉంటారు. అంతే కాదు ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ పాఠశాలలు, నీటి ట్యాంకులు, రహదారులు నిర్మించి ఆ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసాడు. ప్రకాష్ రాజ్ జీవితం లో సినిమా అనేది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ఆయన్ని దగ్గరుండి చూసిన వ్యక్తిగా చెప్తున్నాను, తనని ఇంతటి వాడిని చేసిన సమాజానికి ఎదో ఒకటి చెయ్యాలి అనే తపన ఆయన లో ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు రాజా రవీంద్ర. ప్రకాష్ రాజ్ ఇన్ని సహాయాలు చేసాడనే విషయం రాజా రవీంద్ర చెప్పే వరకు ఎవరికీ తెలియదు.
