Pushpa 2 : లెక్కల మాస్టర్ సుకుమార్ తన చిత్రాల్లో ప్రతీదానికి ఓ లెక్క ఉండేట్టు చూసుకుంటాడు. చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటున్నాడు. అంతే కేర్ తీసుకోబట్టే పుష్ప1 మూవీ నేషనల్ లెవల్ లో దుమ్ము దులిపింది. అల్లు అర్జున్ కు ఏకంగా జతీయ ఉత్తమ నటుడు అవార్డ్ దక్కింది. జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. తన తాజా సినిమా పుష్ప 2: ది రూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రఖ్యాత చిత్రదర్శకుడు సుకుమార్ నైపుణ్యంగా దీన్ని చెక్కుతున్నాడు. ఈ సినిమా సెకండాఫ్ ను భారీ ఖర్చుతో భారీగా తీస్తున్నారు. బన్నీతో పాటు, ప్రముఖ నటి రష్మిక మందన్న ఈ షూటింగ్ లో పాలు పంచుకున్నారు.
ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని ఆగష్టు 15, 2024న ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ ప్రకటనతోపాటు ఆ పోస్టర్ లో ఓ అరుదైన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది అత్యంత ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్‌లో పుష్ప రాజ్ చివరి చిటికెన్ వేలు కు గులాబీ రంగులో నెయిల్ పాలిష్ వేసి ఉంది. మిగతా వేళ్లు అన్నీ నార్మల్ గా ఉన్నాయి. ఈ పింకీ వేలు గోరు పొడవుగా ఆకట్టుకునేలా ఉంది. ఇప్పుడు దీని కథ ఏంటన్నది ఆసక్తి రేపుతోంది.
ఈ పోస్టర్ విడుదలయ్యాక ఇలా పెంచుకునే వారిపై ఆసక్తితో కొంతమంది పింకీ వేళ్లపై పొడవాటి గోళ్లను పెంచుకునే పురుషుల సాంస్కృతిక ప్రాముఖ్యతను అన్వేషించడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. నిర్దిష్ట కొన్ని సంస్కృతులలో ఆధిపత్యం వహించే వారి చేతిపై పొడవాటి పింకీ గోరు ఉంటుందట.. వారు ఈ గోరును ఇలా పెంచడాన్ని సంపదగా భావిస్తారు. ఇది వారి ఉన్నత సామాజిక స్థితిని సూచిస్తుంది. లేబర్ నుండి గొప్ప వ్యక్తిగా ఎదిగిన వ్యక్తులు ఇలా పెంచుకుంటారట.. చిత్తూరు జిల్లాలో ఈ సంస్కృతి ఉన్నట్టు సమాచారం. ఈ వేలి గోరు కథ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. నెటిజన్లు సుకుమార్ ఇంతటి చిన్న విషయాలపై కూడా శ్రద్ధ చూపినందుకు అందరూ మెచ్చుకుంటున్నారు.
అల్లు అర్జున్ – రష్మిక మందన్నల డైనమిక్ ద్వయంలో హేమాహేమీలైన నటీనటులు ఉన్నారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, ఇతర విశిష్ట నటీనటులు నటిస్తున్నారు. అత్యంత ఆకట్టుకునే సమిష్టి తారాగణం ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.