LIK Movie First Review: వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అని అందుకోవడమే కాకుండా, మూడు సార్లు కూడా వంద కోట్ల గ్రాస్ మార్కుని ఒక కొత్త హీరో అందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. చాలా అదృష్టం , టాలెంట్ ఉంటే తప్ప ఇలాంటి అసాధ్యం. అలాంటి అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసి యూత్ ఆడియన్స్ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). ఇతను ఎలా హీరో అయ్యాడు రా బాబు అని మొదట్లో చూసినప్పుడు ప్రతీ ఒక్కరిలో ఒక ఫీలింగ్ కలగడం సహజం. కానీ టాలెంట్ ఉంటే ఎలాంటి వారైనా హీరో అవ్వగలరని నిరూపించి చూపించి కోట్లాది మంది యువతకు ఆదర్శంగా నిలిచాడు. గత ఏడాది ‘డ్యూడ్’ చిత్రం తో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ప్రదీప్ రంగనాథన్ , ఈ నెల 10 న మన ముందుకు ‘LIK’ అనే చిత్రం ద్వారా రాబోతున్నాడు.
రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని చెన్నై లో కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు , మీడియా ప్రతినిధులకు వేసి చూపించారు. వాళ్ళ నుండి ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వచ్చిందో ఒకసారి చూద్దాం. కథ విషయం లోకి వెళ్తే టెక్నాలజీ పీక్ రేంజ్ కి వెళ్లిన 2040 వ సంవత్సరం లో, మొబైల్ కి అడిక్ట్ అయిన ఒక అమ్మాయి , యాప్స్ ని పిచ్చి పిచ్చిగా వాడేస్తుంది. ఫోన్ లేకపోతే ఆమెకు జీవితం కూడా ఉండదేమో , అంతలా అడిక్ట్ అయిపోయి ఉంటుంది. అలాంటి అమ్మాయిని ఒక కుర్రాడు తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. అయితే ప్రతీ ముఖ్యమైన విషయానికి ఇన్సూరెన్స్ చేసుకునే జనాలు , ప్రేమకు ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోరు, ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలని LIK అనే యాప్ ని సృష్టిస్తాడు ఒక ప్రముఖ వ్యక్తి.
ఆ యాప్ యూత్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇతని ప్రేమించవచ్చా లేదా ?, మనకి తగినవాడా కాదా?, మనల్ని మోసం చేస్తున్నాడా లేదా వంటివి ఈ యాప్ కనిపెట్టి చెప్తుంది అన్నమాట. హీరోయిన్ కూడా ఇదే యాప్ ని ఆధారంగా చేసుకొని హీరోతో కనెక్ట్ అవుతుంది. కానీ ఒకరోజు హీరోయిన్ కి ఈ యాప్ హీరో మోసం చేశాడని చూపిస్తుంది. దాంతో బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఈ చిత్రం కథ. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం అలా సరదాగా సాగిపోతుందట , ఇంటర్వెల్ లో ప్రదీప్ రంగనాథన్ మార్క్ ట్విస్ట్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేస్తుందట. ఫస్ట్ హాఫ్ లాగానే సెకండ్ హాఫ్ కూడా కాస్త ఫన్ తో, ఎమోషన్స్ తో చాలా చక్కగా , ఇన్నోవేటివ్ గా చూపించాడట డైరెక్టర్ విగ్నేష్ శివన్. కచ్చితంగా ఈ చిత్రం కూడా ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లో మరో ల్యాండ్ మార్క్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. మరి అందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే 10 వ తేదీ వరకు ఆగాల్సిందే.