spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas Varsham Movie Facts: ప్రభాస్ వర్షం మూవీ ని ముందుగా ఆ డైరెక్టర్ తో...

Prabhas Varsham Movie Facts: ప్రభాస్ వర్షం మూవీ ని ముందుగా ఆ డైరెక్టర్ తో చేయాలనుకున్నాడా..?

Prabhas Varsham Movie Facts: ప్రభాస్ హీరోగా ఎమ్మెస్ రాజు ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన వర్షం సినిమా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకి శోభన్ దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఇక వర్షం సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రభాస్ కి ఒక సక్సెస్ కూడా లేదు. రెండు సినిమాలు చేసిన కూడా అవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రభాస్ ఎలాంటి సినిమాలు చేయాలి అనుకున్న సందర్భంలో ఎమ్మెస్ రాజు వర్షం సినిమా కథ చెప్పి అతనిని ఒప్పించాడు. కథ బాగుంది కానీ ఈ మూవీకి దర్శకుడిగా ఎవర్ని తీసుకుందాం అని ప్రభాస్ ఎమ్మెస్ రోజు చర్చించుకున్నారట. మొత్తానికైతే ఎమ్మెస్ రాజు శోభన్ ని తీసుకుందామని చెప్పాడట. అయితే అంతకుముందు శోభన్ మహేష్ బాబుతో బాబీ అనే సినిమా చేసి భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు.

కాబట్టి అప్పుడు ప్రభాస్ శోభన్ ఎందుకు వేరే సక్సెస్ఫుల్ దర్శకుడితో సినిమా చేసుకుందామని చెప్పారట… వి వి వినాయక్ తో ఈ సినిమా చేద్దామా అని ప్రభాస్ ఎమ్మెస్ రాజును కూడా అడిగారట. కానీ ఎమ్మెస్ రాజు మాత్రం లేదు శోభన్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్ ఆయన బాగా తీస్తాడు అని చెప్పి ప్రభాస్ ను ఒప్పించాడట.

మొత్తానికైతే శోభన్ వర్షం సినిమాని నెక్స్ట్ లెవెల్ సక్సెస్ గా నిలపడమే కాకుండా తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ఆయన చనిపోవడం ఇండస్ట్రీ కి చాలా పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు తన కొడుకులు అయిన సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ లు సైతం ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ వినాయక్ ను తీసుకుందామా అని ఎందుకు అడిగాడు అంటే ప్రభాస్ కి వినాయక్ కి అంతకు ముందు నుంచి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ చనువుతోనే వినాయక్ ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేస్తాడనే ఉద్దేశ్యంతో అడిగారట. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ కి వర్షం సినిమా లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper
Exit mobile version