Prabhas Flop Movies: చాలా మంది హీరోలు చేసే సినిమాలు కంటెంట్ ను బట్టి సక్సెస్ లను సాధిస్తాయి. కొంతమంది హీరోలు చేసే సినిమాల కంటెంట్ బాగున్నప్పటికి వాళ్ళ క్రేజ్ కి తగ్గట్టుగా ఆ సినిమాలు ఉండకపోవడం వల్ల ప్లాప్ లుగా మారుతుంటాయి… నిజానికి ప్రభాస్ కెరియర్ లో ఇదే జరిగింది. వర్షం సినిమా తర్వాత ఆయన క్రేజ్ తారా స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ‘చక్రం’ సినిమా చేశాడు. నిజానికి ఆ సినిమా పాయింట్ చాలా గొప్పది. అయినప్పటికి ఆ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..
కారణం ఏంటి అంటే అది ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ కథ కాదు. దానికి కొత్త హీరో అయితే బాగా సెట్ అయ్యేవాడు సినిమా కూడా బాగా ఆడేది. చత్రపతి సినిమా తర్వాత ప్రభాస్ ఆల్మోస్ట్ టాప్ హీరోల్లో ఒకరిగా మారిపోయాడు. కాబట్టి ఆ సినిమా తర్వాత చేసిన పౌర్ణమి సినిమా సైతం ప్రభాస్ ఇమేజ్ ను ఏమాత్రం టచ్ చేయలేకపోయింది.
అందువల్లే ఈ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. స్టార్ హీరోలకు కథలు చెప్పేటపుడు వాళ్ల ఇమేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. హీరో అభిమానులు థియేటర్ కి వచ్చి సినిమా చూసినప్పుడు హీరో క్యారెక్టర్ ఎక్కడ తగ్గకుండా వాళ్ళకి ఒక హై ఇవ్వాలి. అలాగే ప్రేక్షకులు సైతం ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది ఆ హీరో ఇమేజ్ ను బట్టి ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటారు.
దాన్ని రీచ్ అయ్యే విధంగా సినిమా ఉంటే సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం డిజాస్టర్ గా మారే అవకాశాలైతే ఉన్నాయి… ఇప్పటివరకు ప్రతి ఒక్క హీరో చేసిన సినిమాలన్నీ వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలే కావడం విశేషం…ఆచితూచి మరి తమ అభిమానులు తనని ఎలా చూడాలనుకుంటున్నారు. ఎలాంటి పాత్ర అయితే తన ఇమేజ్ కి బాగా సెట్ అవుతుందనే విషయాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మరి సినిమాలకు కమిట్ అవుతూ ఉంటారు…
