Prabhas: ప్రస్తుతం పాన్ ఇండియాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక బాహుబలి సినిమాతో ఆయన తనదైన రీతిలో నటించి మెప్పించాడు. బాహుబలి రెండు పార్టులు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రభాస్ ను పాన్ ఇండియాలో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మార్చేసింది. ఇక ఇలాంటి క్రమంలోనే ‘బాహుబలి ది టార్చ్ బేరర్’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో దానికంటే ముందు ప్లే అయిన వీడియో ఇప్పుడు పెను సంచలనాలను క్రియేట్ చేస్తుంది.
బాహుబలి 3 ఉండబోతుంది అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక అనౌన్స్ మెంట్ వీడియో అయితే వచ్చింది. అది ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే సినిమా యూనిట్ మొత్తం అందరూ కలిసి బాహుబలి 3 ఉంటుంది అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం అందరిని ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ప్రభాస్ సైతం ఈ సినిమా షూటింగ్ ను చాలా ఎంజాయ్ చేస్తూ చేశామని అదొక ఎమోషనల్ జర్నీ అంటూ ఆయన మాట్లాడుతూనే ఎమోషనల్ అయ్యాడు. ఇక ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరో నుంచి కూడా కన్నీళ్లు వస్తాయా ఆయన కూడా ఎమోషనల్ అవుతాడా అంటూ చాలా మంది వల్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రభాస్ నుంచి ఏడుపును ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు.
ఇక ప్రతి సినిమాలో కూడా ఆయన భారీ ఫైట్లు, విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కాబట్టి నిజ జీవితంలో ప్రభాస్ ఎమోషనల్ గా ఉంటాడా? అనేది కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది… ఇక ఏది ఏమైనా కూడా బాహుబలి 2 పార్టులు ఎంత విజయాన్ని సాధించాయో దానికి మించిన సక్సెస్ ని ఈ మూడోవ పార్ట్ సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
