https://oktelugu.com/

ప్రభాస్ ఫోన్ వాడడట.. షాకింగ్ నిజాలివీ!

స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించగలమా? ఇప్పుడు అన్ని దాంట్లోనే. పనులు, బిల్స్ కట్టడం.. మాట్లాడడం.. ఈ ఆధునిక జీవితంలో ఫోన్ లేకపోతే ఏదీ నడవదు. సామాన్యులే ఇంతగా వాడేసే ఫోన్ ను సెలెబ్రెటీలు అయితే నెలకొకటి మార్చేస్తుంటారు. హీరో హీరోయిన్లు అయితే ఖరీదైన ‘ఐఫోన్’ రిలీజ్ కాగానే కొని పాత ఫోన్ ను వదిలేస్తుంటారు. అయితే మన చిన్నప్పుడు ఈ ఫోన్లు గట్రా ఏమీ లేవు. ఉత్తరాలు రాసేవారు. తర్వాత ఎస్టీడీ ఐఎస్డీ ల్యాండ్ ఫోన్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 7, 2021 / 01:02 PM IST
    Follow us on

    స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించగలమా? ఇప్పుడు అన్ని దాంట్లోనే. పనులు, బిల్స్ కట్టడం.. మాట్లాడడం.. ఈ ఆధునిక జీవితంలో ఫోన్ లేకపోతే ఏదీ నడవదు. సామాన్యులే ఇంతగా వాడేసే ఫోన్ ను సెలెబ్రెటీలు అయితే నెలకొకటి మార్చేస్తుంటారు. హీరో హీరోయిన్లు అయితే ఖరీదైన ‘ఐఫోన్’ రిలీజ్ కాగానే కొని పాత ఫోన్ ను వదిలేస్తుంటారు.

    అయితే మన చిన్నప్పుడు ఈ ఫోన్లు గట్రా ఏమీ లేవు. ఉత్తరాలు రాసేవారు. తర్వాత ఎస్టీడీ ఐఎస్డీ ల్యాండ్ ఫోన్లు వచ్చాయి. అయితే స్మార్ట్ ఫోన్ వీటన్నింటిని రూపు మార్చి విప్లవాన్ని సృష్టించింది.

    అయితే అందరు సెలబ్రెటీలు ఫోన్లు తెగ వాడేస్తుంటారు. కానీ హీరో ప్రభాస్ సహా సీనియర్ హీరోలు ఇప్పటికీ ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాల్లో యాక్టివ్ గా ఉండరు.చిరంజీవి ఈ మధ్యనే ట్విట్టర్, ఇన్ స్టాగ్రాంలో చేరారు. నాగార్జున సైతం పెద్దగా ఫోన్ వాడరట..

    ఇక ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే అస్సలు తన చేతిలో ఎప్పుడూ ఫోన్ కనబడదని ఆయనను దగ్గరి నుంచి చూసిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ సీక్రెట్ ను బయటపెట్టాడు.

    తాను ప్రభాస్ ను కలిసినప్పుడు అతడి దగ్గర ఫోన్ ఉన్నట్టు తను ఎప్పుడూ చూడలేదని అంటున్నాడు నాగ్ అశ్విన్. తామిద్దరం మాట్లాడేటప్పుడు ఆయన ఫోన్ రింగ్ అయినట్టు కూడా తనకు గుర్తు లేదని సంచలన విషయాలను బయటపెట్టాడు.

    ప్రభాస్ ఫోన్ పెద్దగా వాడడని.. ఆయన సోషల్ మీడియాలో కూడా ఇటీవలే జాయిన్ అయ్యి చాలా తక్కువగా దాన్ని చూస్తాడని నాగ్ అశ్విన్ తెలిపాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి ఫాలోవర్స్ ఎంతమంది లాంటి విషయాలు ప్రభాస్ కు పట్టవని నాగ్ అశ్విన్ తెలిపాడు. అయితే ప్రభాస్ తన ఇంటికి ఎవరు వచ్చినా వారికి మంచి విందు ఇచ్చి పంపడం అలవాటు అని చెబుతున్నారు.