Peddi 24 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై 24 రోజులు పూర్తి అయ్యింది. కానీ ఇప్పటికీ ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లోనూ వీకెండ్స్ వస్తే డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా నమోదు అవుతున్నాయి. కానీ ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం బట్టి చూస్తుంటే , ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 36 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రావాలి. కానీ అది దాదాపుగా అసాధ్యమే. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 24 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 24 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 24 రోజుల్లో ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే , నైజాం ప్రాంతం నుండి 54 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 21 కోతిలా 10 లక్షలు , ఉత్తరాంధ్ర నుండి 23 కోట్లు, ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 92 లక్షలు, వెస్ట్ గోదావరి నుండి 9 కోట్ల 14 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 64 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 10 కోట్ల 26 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 5 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 149 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 231 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక నుండి 15 కోట్ల 30 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 15 లక్షలు , ఓవర్సీస్ నుండి 23 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దీంతో ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 203 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 347 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 350 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లు రాబట్టినప్పటికీ, రెస్ట్ ఆఫ్ ఇండియా వసూళ్లు తీవ్రంగా నిరాశపర్చడం వల్ల, ఈ సినిమా ఓవరాల్ బ్రేక్ ఈవెన్ నెంబర్ అందుకోలేకపోతోంది.
