Pawan Kalyan Vs Lokesh Kanagaraj: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj). హీరోతో సంబంధం లేకుండా, యూత్ ఆడియన్స్ కేవలం ఈయన పేరుని థియేటర్స్ కి క్యూలు కడుతారు. అలాంటి క్రేజ్, బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న డైరెక్టర్ ఆయన. ఆయన గత చిత్రం ‘కూలీ’ భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అది కూడా A సర్టిఫికేట్ తో. కచ్చితంగా రజినీకాంత్ క్రేజ్ కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ రావడానికి కారణం అయ్యుండొచ్చు, కానీ మెజారిటీ క్రెడిట్ లోకేష్ కనకరాజ్ కి వెళ్ళిపోయింది. అలాంటి బ్రాండ్ ఉంది కాబట్టే , రెమ్యూనరేషన్ విషయం లో లోకేష్ కనకరాజ్ అసలు తగ్గడం లేదు.
తెలుగులోకి ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియా లో వచ్చినప్పుడు, ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేయబోతున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. తమిళ టాప్ మీడియా చానెల్స్ కూడా ఇదే విషయాన్నీ ధ్రువీకరించాయి. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం లోకేష్ కనకరాజ్ చర్చలు జరిపిన విషయం వాస్తవమే, కానీ రెమ్యూనరేషన్ విషయం లో చిన్న క్లాష్ వచ్చింది. ఈ చిత్రాన్ని KVN సంస్థ నిర్మించాల్సి ఉంది. KVN సంస్థ 70 రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్దంగానే ఉన్నాడు. కానీ లోకేష్ కనకరాజ్ వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసాడట. అంత ఇవ్వడానికి KVN సంస్థ ఒప్పుకోలేదు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ అల్లు అర్జున్ తో సినిమా చేయడం కోసం 120 కోట్ల రూపాయిల ఆఫర్ ని లోకేష్ కి ఇచ్చారట. అడ్వాన్స్ గా 50 కోట్ల రూపాయిలు ఇచ్చారట.
దీంతో లోకేష్ పవన్ కళ్యాణ్ సినిమాని పక్కన పెట్టి , అల్లు అర్జున్ సినిమాకు జంప్ అయ్యినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అయ్యో బంగారం లాంటి కాంబినేషన్ ని మిస్ అయ్యామే అంటూ బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ స్థార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయకుండా, కేవలం తన పేరు మీద సినిమా చేస్తేనే అంచనాలు భారీ లెవెల్ లో ఉండేవి . ఓపెనింగ్స్ అయితే కళ్ళు చెదిరిపోతుంటాయి. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న పవన్ కళ్యాణ్, లోకేష్ కనకరాజ్ లాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్ తో సినిమా చేసుంటే ఏ లెవెల్ లో ఉండేదో మీరే ఊహించుకోండి. అలాంటి క్రేజీ కాంబినేషన్ నోటి దాకా వచ్చి చేజారిపోయింది.